News February 13, 2025

భారీ భద్రత మధ్య విజయవాడకు వల్లభనేని వంశీ

image

వల్లభనేని వంశీని భారీ పోలీసుల భద్రత మధ్య హైదరాబాద్ నుంచి విజయవాడ తరలిస్తున్నారు. ఏపీ సరిహద్దులో వాహనాన్ని మార్చినట్లు తెలుస్తోంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సరిహద్దుల్లో అదనపు పోలీసు బలగాలను మోహరించారు.

Similar News

News January 15, 2026

ఇర్కాన్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఉద్యోగాలు… అప్లై చేశారా?

image

<>ఇర్కాన్ <<>>ఇంటర్నేషనల్ లిమిటెడ్‌ 32 కాంట్రాక్ట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది.. బీటెక్, బీఈ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు జనవరి 19 వరకు ఆఫ్‌లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 50ఏళ్లు . నెలకు జీతం రూ.60 వేలు చెల్లిస్తారు. షార్ట్ లిస్టింగ్, రాత పరీక్ష/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://www.ircon.org

News January 15, 2026

ఇంద్రవెల్లి: ఇక ఈ బాధ్యత.. అల్లుడిదే..!

image

ఆసియా ఖండంలోనే 2వ అతిపెద్ద గిరిజనుల జాతరగా పేరుగాంచిన కేస్లాపూర్ నాగోబా జాతర ఈనెల 18న ప్రారంభం కానుంది. మెస్రం వంశీయులు హస్తినమడుగు పవిత్ర గంగాజలాన్ని సేకరించారు. మర్రిచెట్టుపై గంగా జలాన్ని భద్రపరిచారు. కలశం (జారీతాలి) నేలపై జారి పడకుండా మహాపూజలు అయ్యే వరకు చెట్టుపై మెస్రం వంశానికి చెందిన అల్లుడే భద్రపరుస్తుంటారు. ఈనెల 15, 16, 18న మహాపూజ, 22న దర్బార్, 22న పెర్సపేన్ బాన్కక్ పూజలు నిర్వహించనున్నారు.

News January 15, 2026

HYD: ఫ్యూచర్ సిటీలో ట్రాఫిక్ రద్దీకి చెక్

image

మహానగరంలో ట్రాఫిక్ తిప్పలు అంతా ఇంత కాదు. కిలోమీటర్ ప్రయాణించాలంటే నరకం కనిపిస్తుంది. కొత్తగా ఏర్పాటైన ఫ్యూచర్ సిటీ పోలీసు కమిషనరేట్‌లో ఈ సమస్య ఉండొద్దని ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసింది. భవిష్యత్ ట్రాఫిక్ రద్దీని ముందే అంచనా వేసి మహేశ్వరం, శంషాబాద్ ట్రాఫిక్ జోన్లుగా విభజించి 4 డివిజన్లు, 10 ట్రాఫిక్ PSలను నెలకొల్పనున్నారు. సమర్థ పర్యవేక్షణకు ట్రాఫిక్ జాయింట్ సీపీని కూడా నియమించనున్నారు.