News February 13, 2025
SRD: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.
Similar News
News January 18, 2026
‘గ్రీన్‌లాండ్ డీల్’ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ టారిఫ్స్

గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలనే తన లక్ష్యాన్ని వ్యతిరేకించిన దేశాలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ అస్త్రాన్ని ప్రయోగించారు. డెన్మార్క్, బ్రిటన్, ఫ్రాన్స్, ఇతర యూరప్ దేశాలపై 10 శాతం సుంకాలు విధించారు. ఫిబ్రవరి 1 నుంచి ఇవి అమల్లోకి వస్తాయని ప్రకటించారు. గ్రీన్‌లాండ్ డీల్ పూర్తి కాకపోతే జూన్ 1 నుంచి టారిఫ్స్‌ను 25 శాతానికి పెంచుతానని హెచ్చరించారు.
News January 18, 2026
కురబలకోట: వేటగాళ్ల కోసం విస్తృతంగా గాలింపు చర్యలు

కురబలకోట మండలం, పిచ్చలవాండ్లపల్లిలో వేటగాళ్లు పునుగు పిల్లిని వేటాడడం శనివారం వెలుగులోకి రావడం తెలిసిందే. నిందితులను పట్టు కునేందుకు అన్నమయ్య జిల్లా ఫారెస్ట్, మదనపల్లె అటవీ శాఖ అధికారులు సంయుక్తంగా బృందాలుగా ఏర్పడి, వేటగాళ్ల కోసం విస్తృతంగా గాలిస్తున్నారు. పునికి పిల్లిని ప్రాణాలతో పట్టుకుంటారా లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది.
News January 18, 2026
జగిత్యాల: ఐదు మున్సిపాలిటీలకు రిజర్వేషన్లు ఖరారు

జగిత్యాల జిల్లాలోని ఐదు మున్సిపాలిటీలకు సంబంధించి కౌన్సిలర్ పదవుల రిజర్వేషన్లను శనివారం జిల్లా కలెక్టర్ బి.సత్యప్రసాద్ ఆధ్వర్యంలో ఖరారు చేశారు. జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ కేటగిరీల వారీగా రిజర్వేషన్లు నిర్ణయించి, మహిళా రిజర్వేషన్లను డ్రా పద్ధతిలో ఖరారు చేశారు. అధికారులు, రాజకీయ పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు.


