News March 20, 2024
గుంటూరుకి చేరిన CRPF బలగాలు

ఆంధ్రప్రదేశ్‌లో సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ బుధవారం ఉదయం గుంటూరు రైల్వే స్టేషన్‌కు కేంద్ర బలగాలు చేరుకున్నాయి. గుంటూరు నగరంలో వారు బస చేయడానికి పరీక్షలు అయిపోయి ఖాళీగా ఉన్న ఇంటర్ కాలేజీలను కేటాయించారు. 650 మంది సిఆర్పిఎఫ్, 425 మంది ప్రొటెక్షన్ ఫోర్స్ పోలీసులు ఉన్నారు.
Similar News
News April 18, 2025
గుంటూరు: పెళ్లికి నిరాకరించిన యువకుడిపై కేసు నమోదు

గుంటూరులో ఓ యూట్యూబర్ జీవితం ఊహించని మలుపు తిరిగింది. యూట్యూబర్‌గా గుర్తింపు పొందిన యువతికి మార్చి 10న నల్లచెరువు 2వ లైనుకు చెందిన కైలాశ్‌తో నిశ్చితార్థం జరిగింది. ఈ నెల 18న పెళ్లి జరగాల్సి ఉండగా, వరుడు పెళ్లికి నిరాకరించాడు. ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు, చేసుకోను అంటూ వెనక్కి తగ్గాడు. మధ్యలో పెద్దలు చర్చలు జరిపినా ఫలితం లేకపోవడంతో బాధిత యువతి లాలాపేట పీఎస్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
News April 18, 2025
గుంటూరు: స్పోర్ట్స్ కోర్సులకు దరఖాస్తుల ఆహ్వానం

పటియాలాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పోర్ట్స్‌లో ఎంఎస్‌సీ స్పోర్ట్స్ కోచింగ్, పీజీ డిప్లొమా కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు గుంటూరు డిఎస్ఈవో పి.నరసింహారెడ్డి గురువారం తెలిపారు. కేంద్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆదేశాల మేరకు ప్రవేశాల ప్రక్రియ మొదలైనట్లు పేర్కొన్నారు. ఈ కోర్సుల్లో చేరదలిచిన అభ్యర్థులు మే 2వ తేదీలోపు ‘ssc.nsnis.in’ వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News April 18, 2025
తెనాలి: తప్పించుకొని తిరుగుతున్న నిందితుడి అరెస్ట్

తెనాలిలో 2022లో జరిగిన హత్య కేసులో నిందితుడు జాన్‌బాబు ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విజయవాడకు చెందిన జాన్‌బాబు హత్య కేసులో రెండో ముద్దాయిగా ఉండి కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్నాడు. మూడు సంవత్సరాలుగా పోలీసులకు కనబడకుండా తిరుగుతున్న జాన్‌బాబును రూరల్ పోలీసులు ఎట్టకేలకు గురువారం అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించడంతో నెల్లూరు జైలుకు తరలించారు.