News February 13, 2025
తాడిపత్రిలో శివలింగం కింద నీటిని చూశారా!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739426936026_727-normal-WIFI.webp)
అనంతపురం జిల్లాలో దక్షిణ కాశీగా పిలవబడుతూ తాడిపత్రిలోని పెన్నా నది ఒడ్డున వెలసిన శ్రీ బుగ్గ రామలింగేశ్వరస్వామి క్షేత్రానికి ఓ విశిష్టత ఉంది. వర్షాలు లేకపోయినా, నీటి వనరులు ఎండిపోయినా ఇక్కడ శివలింగం కింద నీరు ఊరుతూనే ఉంటుంది. అయితే అలంకరణలో ఉన్న సమయంలో దర్శనానికి వెళ్లే భక్తులకు ఆ దృశ్యాన్ని చూసే భాగ్యం కలగదు. పై ఫొటోలో శివలింగం కింద నీటిని స్పష్టంగా చూడొచ్చు.
Similar News
News February 13, 2025
కరీంనగర్: దత్తత ఉత్తర్వులు అందించిన కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739443952146_60382139-normal-WIFI.webp)
మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని కరీంనగర్ శిశు గృహం నుంచి పిల్లలను దత్తత తీసుకున్న దంపతులకు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఈరోజు కలెక్టరేట్‌లో దత్తత ఉత్తర్వులు అందజేశారు. శిశు గృహం నుంచి ఐదుగురు మగ శిశువులను, నలుగురు ఆడ శిశువులను వరంగల్, సిద్దిపేట, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, నల్గొండ జిల్లాలకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు.
News February 13, 2025
ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739444473450_51243309-normal-WIFI.webp)
హనుమకొండ జిల్లాలో ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ ప్రావీణ్య ఆదేశించారు. ఈ నెల 27న జరగనున్న ఉపాధ్యాయ, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణపై గురువారం కలెక్టరేట్‌లో నోడల్ అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సంబంధిత అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు.
News February 13, 2025
వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739449223042_1045-normal-WIFI.webp)
AP: వల్లభనేని వంశీపై మరో 2 కేసులు నమోదు కానున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల సమయంలో వంశీ నకిలీ పట్టాలు పంపిణీ చేసినట్లు నమోదైన కేసులో ఆయన పాత్ర లేదని అప్పట్లో పోలీసులు తేల్చారు. ఆ కేసును రీ ఓపెన్ చేయాలని MLA యార్లగడ్డ పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరంలో YSRCP హయాంలో రూ.210 కోట్ల మేర మట్టి అక్రమ తవ్వకాలు జరిగినట్లు విజిలెన్స్ విభాగం తేల్చింది. ఈ కేసుల్లో వంశీని పోలీసులు దర్యాప్తు చేసే ఛాన్స్ ఉంది.