News February 13, 2025

రంగరాజన్‌పై దాడి.. కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు

image

TG: రంగరాజన్‌పై దాడి కేసుకు సంబంధించి పోలీసుల కస్టడీ పిటిషన్‌లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ‘10 నెలల క్రితమే రంగరాజన్‌ను రామరాజ్యం రాఘవరెడ్డి కలిసి తమ సంస్థకు మద్దతు తెలపాలని కోరారు. తమకు రిక్రూట్మెంట్ చేయడంతో పాటు ఆర్థిక సాయం చేయాలన్నాడు. రాఘవరెడ్డి ప్రతిపాదనను రంగరాజన్ ఒప్పుకోలేదు. ఈ అక్కసుతోనే దాడికి ప్లాన్ చేసిన రాఘవరెడ్డి 22 మందితో చిలుకూరు వెళ్లాడు’ అని పోలీసులు పిటిషన్‌లో పేర్కొన్నారు.

Similar News

News February 13, 2025

RECORD: 82 లీటర్ల పాలు ఇచ్చిన ఆవు

image

సాధారణంగా ఒక్క ఆవు మహా అంటే 5 నుంచి 10 లీటర్ల పాలు ఇస్తుంటుంది. కానీ, పంజాబ్‌కు చెందిన ఓ ఆవు ఏకంగా 82 లీటర్ల పాలను ఉత్పత్తి చేసి జాతీయ రికార్డు సృష్టించింది. లూథియానాలోని 18వ అంతర్జాతీయ PDFA డైరీ & అగ్రి ఎక్స్‌పోలో హోల్‌స్టెయిన్ ఫ్రైసియన్ జాతి ఆవు 24 గంటల్లో 82 లీటర్ల పాలు ఉత్పత్తి చేసి ఆశ్చర్యపరిచింది. ఇది పంజాబ్ పశువుల పెంపకం, వాటి పాల సామర్థ్యాన్ని ప్రదర్శించింది.

News February 13, 2025

తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది: నిర్మలా సీతారామన్

image

తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపడం లేదని ఆమె స్పష్టం చేశారు.

News February 13, 2025

ముగ్గురు పాక్ ప్లేయర్ల ఓవరాక్షన్.. ఐసీసీ చర్యలు

image

ముక్కోణపు వన్డే(PAK-NZ-SA) సిరీస్‌లో భాగంగా సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు దురుసుగా ప్రవర్తించారు. దీంతో ICC కొరడా ఝుళిపించింది. SA బ్యాటర్ మాథ్యూను ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న షాహీన్ అఫ్రీదికి మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత పెట్టింది. అలాగే కెప్టెన్ బవుమాను రనౌట్ చేసిన తర్వాత సౌద్ షకీల్, కమ్రాన్ గెటౌట్‌ అంటూ రియాక్షన్ ఇచ్చారు. దీంతో ఐసీసీ వారిద్దరి ఫీజులో 10 శాతం కట్ చేసింది.

error: Content is protected !!