News February 13, 2025
భద్రాద్రి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739428564039_710-normal-WIFI.webp)
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దుమ్ముగూడెం మండలం బైరాగులపాడు వద్ద లారీ బైక్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు మృతి చెందారు. ఈఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News February 13, 2025
ఆన్‌లైన్‌లో కొన్న వస్తువులను రిటర్న్ చేస్తున్నారా?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739449506718_746-normal-WIFI.webp)
ఆన్‌లైన్‌లో కొన్న వస్తువు నచ్చకపోతే రిటర్న్ పంపించేస్తుంటాం. అయితే అలా రిటర్న్ చేయడంలో ఇండియన్సే ఎక్కువగా ఉన్నట్లు తేలింది. భారతీయులు 100 ప్రొడక్ట్స్ కొంటే అందులో 81 రిటర్న్ చేస్తున్నట్లు తాజా నివేదికలో వెల్లడైంది. ఆ తర్వాత చైనా (66), జర్మనీ (54), యూకే (50), అమెరికా (48), స్పెయిన్ (48), సౌత్ కొరియా (47), ఫ్రాన్స్ (46), ఆస్ట్రేలియా (44) దేశాలున్నాయి. INDలో ఎక్కువ మంది ఎందుకు రిటర్న్ పంపుతున్నారు?
News February 13, 2025
NLG: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739446709727_50283763-normal-WIFI.webp)
వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. బరిలో ఎక్కువమంది పోటీ పడుతుండడంతో ఎన్నిక రసవత్తరం కానుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
News February 13, 2025
క్రమం తప్పకుండా విజిలెన్స్ కమిటీ సమావేశాలు నిర్వహించాలి: కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739449582577_18976434-normal-WIFI.webp)
క్రమం తప్పకుండా విజిలెన్స్ కమిటీ సమావేశాలు నిర్వహించాలని భూపాలపల్లి కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. గురువారం జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి విజిలెన్స్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని వసతి గృహాలు, ప్రభుత్వ పాఠశాలాల్లో మధ్యాహ్న భోజన నాణ్యతా ప్రమాణాలు పాటించాలన్నారు. ఫుడ్ సేఫ్టీ కమిటీ అధికారులు, మండల ప్రత్యేక అధికారులు తనిఖీలు చేపట్టాలన్నారు.