News February 13, 2025
స్టార్ టేబుల్ టెన్నిస్ ప్లేయర్ ఇంట విషాదం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739428178460_782-normal-WIFI.webp)
భారత టేబుల్ టెన్నిస్ స్టార్ ప్లేయర్, ఖేల్ రత్న పురస్కార గ్రహీత మనికా బత్రా ఇంట విషాదం నెలకొంది. ఆమె తండ్రి గిరీశ్ బత్రా(65) కార్డియాక్ అరెస్ట్‌తో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో ఆమె కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విషయం తెలుసుకున్న మనికా సహచరులు, ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆమె ఈ విషాదం నుంచి త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ధైర్యం చెబుతూ SMలో పోస్టులు పెడుతున్నారు.
Similar News
News February 13, 2025
జట్టులో అంతమంది స్పిన్నర్లు ఎందుకు?: అశ్విన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739450906432_1045-normal-WIFI.webp)
ఛాంపియన్స్ ట్రోఫీకి భారత్ ఐదుగురు స్పిన్నర్లను ఎంపిక చేయడంపై మాజీ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ విస్మయం వ్యక్తం చేశారు. ‘ఒక టూర్‌లో ముగ్గురు లేదా నలుగురు స్పిన్నర్లంటే అర్థం చేసుకోవచ్చు. కానీ మరీ ఐదుగురు స్పిన్నర్లా..? అది కూడా దుబాయ్ పిచ్‌లో ఆడేందుకు? మరీ ఎక్కువమందిని తీసుకున్నారనిపిస్తోంది. జడేజా, అక్షర్, కుల్‌దీప్, వరుణ్, సుందర్‌లో ఎవర్ని ఆడిస్తారు? ఎవర్ని పక్కన పెడతారు?’ అని ప్రశ్నించారు.
News February 13, 2025
లగ్జరీ కార్లతో స్టూడెంట్స్ రచ్చ.. షాకిచ్చిన పోలీసులు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739445496337_695-normal-WIFI.webp)
గుజరాత్ సూరత్‌లోని ఓ స్కూల్‌కు చెందిన 12వ తరగతి విద్యార్థులు ఇటీవల ఫేర్‌వెల్ పార్టీకి 35 లగ్జరీ కార్లతో వచ్చి <<15425002>>హల్‌చల్ చేశారు<<>>. లైసెన్సు లేకుండా కారు నడపడమే కాకుండా స్టంట్లు చేస్తూ వీడియోలు తీసుకున్నారు. ఈ దృశ్యాలు వైరలవడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు. 22 కార్లను సీజ్ చేశామని, మరికొన్ని కార్లను గుర్తిస్తున్నామని DCP బరోత్ వెల్లడించారు.
News February 13, 2025
వల్లభనేని వంశీపై మరో రెండు కేసులు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739449223042_1045-normal-WIFI.webp)
AP: వల్లభనేని వంశీపై మరో 2 కేసులు నమోదు కానున్నట్లు సమాచారం. 2019 ఎన్నికల సమయంలో వంశీ నకిలీ పట్టాలు పంపిణీ చేసినట్లు నమోదైన కేసులో ఆయన పాత్ర లేదని అప్పట్లో పోలీసులు తేల్చారు. ఆ కేసును రీ ఓపెన్ చేయాలని MLA యార్లగడ్డ పిటిషన్ దాఖలు చేశారు. గన్నవరంలో YSRCP హయాంలో రూ.210 కోట్ల మేర మట్టి అక్రమ తవ్వకాలు జరిగినట్లు విజిలెన్స్ విభాగం తేల్చింది. ఈ కేసుల్లో వంశీని పోలీసులు దర్యాప్తు చేసే ఛాన్స్ ఉంది.