News February 13, 2025
ఇలాంటి డాక్టర్లు చాలా అరుదు!
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739422530224_746-normal-WIFI.webp)
వైద్యాన్ని వ్యాపారం చేసిన ఈ రోజుల్లో పేదలకు ఉచిత వైద్యసేవలు అందిస్తూ ఎంతో మందికి పునర్జన్మనిచ్చారు వారణాసికి చెందిన డా.తపన్ కుమార్ లాహిరి. 2003లోనే ఆయన రిటైర్ అయినప్పటికీ 83 ఏళ్ల వయసులోనూ రోగులకు సేవలందిస్తున్నారు. 1994 నుంచి తన జీతం మొత్తాన్ని నిరుపేదల కోసం విరాళంగా ఇచ్చి పెన్షన్‌తో జీవిస్తున్నారు. రోజూ ఉదయం గొడుగు పట్టుకొని నడుస్తూ క్లినిక్‌కు వెళ్తుంటారు. ఆయనను 2016లో పద్మశ్రీ వరించింది.
Similar News
News February 13, 2025
IPL: ఆ ఇద్దరు ఎవరో?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739429807884_1226-normal-WIFI.webp)
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, KKR జట్లకు కెప్టెన్లు ఖరారు కావాల్సి ఉంది. ఢిల్లీకి అక్షర్ పటేల్, రాహుల్ తదితర ప్లేయర్ల పేర్లు పరిశీలనలో ఉండగా కోల్‌కతాకు రసెల్, రహానే, నరైన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరి మేనేజ్మెంట్స్ ఎవరివైపు మొగ్గుతాయో త్వరలో తేలనుంది.
ఇతర జట్ల కెప్టెన్లు:
CSK-రుతురాజ్, గుజరాత్-గిల్, లక్నో-పంత్, పంజాబ్-శ్రేయస్, రాజస్థాన్-శాంసన్, MI-హార్దిక్, ఆర్సీబీ-రజత్ పాటిదార్, SRH-కమిన్స్.
News February 13, 2025
RECORD: 82 లీటర్ల పాలు ఇచ్చిన ఆవు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739447011267_746-normal-WIFI.webp)
సాధారణంగా ఒక్క ఆవు మహా అంటే 5 నుంచి 10 లీటర్ల పాలు ఇస్తుంటుంది. కానీ, పంజాబ్‌కు చెందిన ఓ ఆవు ఏకంగా 82 లీటర్ల పాలను ఉత్పత్తి చేసి జాతీయ రికార్డు సృష్టించింది. లూథియానాలోని 18వ అంతర్జాతీయ PDFA డైరీ & అగ్రి ఎక్స్‌పోలో హోల్‌స్టెయిన్ ఫ్రైసియన్ జాతి ఆవు 24 గంటల్లో 82 లీటర్ల పాలు ఉత్పత్తి చేసి ఆశ్చర్యపరిచింది. ఇది పంజాబ్ పశువుల పెంపకం, వాటి పాల సామర్థ్యాన్ని ప్రదర్శించింది.
News February 13, 2025
తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయింది: నిర్మలా సీతారామన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739448171412_81-normal-WIFI.webp)
తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాజ్యసభలో కీలక వ్యాఖ్యలు చేశారు. విభజనకు ముందు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉండేదని, ఇప్పుడు అప్పుల్లో కూరుకుపోయిందని వెల్లడించారు. తమ ప్రభుత్వం ఏ రాష్ట్రం పట్ల వివక్ష చూపడం లేదని ఆమె స్పష్టం చేశారు.