News February 13, 2025

సిద్దిపేట: బర్డ్ ఫ్లూ దెబ్బ.. చికెన్ ధరలు అబ్బా

image

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ వ్యాధి కలకలం రేపుతుంది. బర్డ్ ఫ్లూ భయంతో పలు ప్రాంతాల్లో చికెన్ అమ్మకాలు భారీగా పడిపోయి ధరలు అమాంతం తగ్గాయి. జిల్లా వ్యాప్తంగా కొన్ని రోజుల క్రితం కేజీ రూ.220 ఉండగా ప్రస్తుతం రూ.170గా ఉంది. కోళ్లలో అసాధారణ మరణాలు, ఏమైనా వ్యాధి లక్షణాలుంటే సమాచారం ఇవ్వాలని జిల్లా పశువైద్యాధికారులు తెలిపారు.

Similar News

News February 13, 2025

రాజాపేట: ఉరేసుకొని యువకుడి సూసైడ్

image

ఉరేసుకొని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన రాజాపేట మండలంలో జరిగింది. SI అనిల్ కుమార్ తెలిపిన వివరాలు.. రఘునాథపురానికి చెందిన బిట్ల రమేశ్ పెద్ద కుమారుడు పవన్(25) గురువారం ఉదయం ఇంట్లో ఎవరులేని సమయంలో ఫ్యాన్‌కు ఉరేసుకున్నాడు. ఘటనాస్థలానిక చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

News February 13, 2025

లగ్జరీ కార్లతో స్టూడెంట్స్ రచ్చ.. షాకిచ్చిన పోలీసులు

image

గుజరాత్ సూరత్‌లోని ఓ స్కూల్‌కు చెందిన 12వ తరగతి విద్యార్థులు ఇటీవల ఫేర్‌వెల్ పార్టీకి 35 లగ్జరీ కార్లతో వచ్చి <<15425002>>హల్‌చల్ చేశారు<<>>. లైసెన్సు లేకుండా కారు నడపడమే కాకుండా స్టంట్లు చేస్తూ వీడియోలు తీసుకున్నారు. ఈ దృశ్యాలు వైరలవడంతో పోలీసులు చర్యలు చేపట్టారు. ఆ విద్యార్థుల తల్లిదండ్రులపై కేసులు నమోదు చేశారు. 22 కార్లను సీజ్ చేశామని, మరికొన్ని కార్లను గుర్తిస్తున్నామని DCP బరోత్ వెల్లడించారు.

News February 13, 2025

ఎంఎల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

ఎంఎల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల పరిశీలకులు కే.సునీత ఆదేశించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల పీఓలను, ఏపీఓలను నియమించారా? అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మాట్లాడతూ.. పీఓలకు, ఏపిఓలకు, ఇతర పోలింగ్ సిబ్బంది ఈనెల 18,24 తేదీల్లో రెండు విడతల్లో శిక్షణ అందించడానికి ఏర్పాటు చేశామన్నారు.

error: Content is protected !!