News February 13, 2025
దామరగిద్ద: మన్యంకొండ జాతరకు వెళ్తే ఇళ్లు దోచారు !
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739415706424_51771152-normal-WIFI.webp)
దామరగిద్ద మండలంలోని ఉల్లిగుండం గ్రామానికి చెందిన చాలామంది తమ ఇంటి ఇలవేల్పు మన్యంకొండ జాతర రథోత్సవానికి ఎడ్లబండ్లతో బయలుదేరి వెళ్లారు. ఇదే అదునుగా భావించిన దుండగులు ఆ గ్రామంపై కన్నేశారు. బుధవారం అర్ధరాత్రి పలు ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. వెంటనే స్థానికులు గమనించి వారిని వెంబడించగా.. వారు తెచ్చుకున్న బైక్ వదిలి పారిపోయినట్లు స్థానికులు వాపోతున్నారు. పోలీసులు చేరుకొని విచారణ చేపట్టారు.
Similar News
News February 13, 2025
పార్వతీపురం: ఇద్దరు పంచాయతీ రాజ్ AEలు సస్పెన్షన్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739451403353_51732952-normal-WIFI.webp)
విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహించడం, పనుల్లో ప్రగతి లేకపోవడంతో ఇద్దరు పంచాయతీ రాజ్ సహాయ ఇంజినీర్లను సస్పెండ్ చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ తెలిపారు. జిల్లాలో జరుగుతున్న వివిధ ఇంజినీరింగ్ పనులపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం కలెక్టర్ సమీక్షించారు. గత మూడు నెలలుగా గుమ్మలక్ష్మీపురం, కురుపాం మండలాల్లో ఎటువంటి ప్రగతి కనిపించలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
News February 13, 2025
పర్యాటకంలో 20 శాతం వృద్ధి ఉండాలి: సీఎం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_122024/1734357735912_367-normal-WIFI.webp)
AP: పర్యాటక రంగ అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఇందులో 20 శాతం వృద్ధి ఉండాలని సూచించారు. మెగా ప్రాజెక్టుగా శ్రీశైలం అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. తిరుపతి, విశాఖ, అమరావతి, రాజమండ్రిలో టూరిజం హబ్స్ ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా బీచ్, క్రూయిజ్ పర్యాటకాన్ని ప్రోత్సహిస్తామని తెలిపారు.
News February 13, 2025
వనపర్తి: మన ఇసుక వాహనం ద్వారానే ఇసుకను పొందాలి: జిల్లా కలెక్టర్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739448504226_18811291-normal-WIFI.webp)
వనపర్తి జిల్లాలో ఇసుక అవసరం ఉన్నవారు మన ఇసుక వాహనం ద్వారానే తీసుకోవాలనీ, దళారులను ఆశ్రయించవద్దని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభీ తెలిపారు. ఈ విషయంలో ప్రజలకు ఏమైనా సమస్యలు తలెత్తితే కంట్రోల్ రూమ్ రూమ్‌కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చు అని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా ప్రజల అవసరం మేరకు మన ఇసుక వాహనం ద్వారా ఇంటి వద్దకే ఇసుక సరఫరా చేయడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు.