News February 13, 2025

వంశీ అరెస్టు సరికాదు: బొత్స

image

AP: మాజీ ఎమ్మెల్యే వంశీ అరెస్టును ఖండిస్తున్నట్లు ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఉపసంహరించుకున్న కేసులో అరెస్ట్ చేయడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కక్షపూరిత రాజకీయాలు తగవన్నారు. తొమ్మిది నెలల అధికారాన్ని కూటమి ప్రభుత్వం వృథా చేసిందని దుయ్యబట్టారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ బూటకమేనని విమర్శించారు.

Similar News

News February 13, 2025

NCA జిమ్‌లో బుమ్రా.. ఫొటో వైరల్

image

వెన్నునొప్పి కారణంగా ఛాంపియన్స్ ట్రోఫీకి దూరమైన బుమ్రా బెంగళూరు NCAలో పునరావాసం పొందుతున్నారు. తాజాగా జిమ్‌లో ఉన్న ఫొటోను ఈ స్టార్ బౌలర్ షేర్ చేస్తూ ‘రీబిల్డింగ్’ అని రాసుకొచ్చారు. దీంతో ఈ ఫొటో వైరలవుతోంది. త్వరగా కోలుకుని ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌కు అందుబాటులోకి రావాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా బుమ్రా స్థానంలో వరుణ్ చక్రవర్తిని బీసీసీఐ CTకి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.

News February 13, 2025

మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన

image

మణిపుర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ కేంద్రం ఉత్తర్వులిచ్చింది. ఇటీవలే CM బీరెన్ సింగ్ రాజీనామా చేసిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. మణిపుర్‌లో మైతేయి, కుకీ వర్గాల మధ్య మే 2023 నుంచి ఘర్షణలు తీవ్రస్థాయిలో జరుగుతున్నాయి. అయితే CM ఓ వర్గానికి కొమ్ము కాస్తున్నారని సొంత పార్టీ MLAలే విమర్శించారు. విశ్వాస పరీక్ష జరిగితే MLAలు విప్‌ను ధిక్కరించే అవకాశం ఉండటంతో బీజేపీ అధిష్ఠానం సూచనతో ఆయన తప్పుకున్నారు.

News February 13, 2025

కొత్త రూల్స్.. లేటైతే డబుల్ ఛార్జ్

image

FEB 17 నుంచి కొత్త FASTag రూల్స్ అమల్లోకి రానున్నాయి. FASTagలో తగిన బ్యాలెన్స్ లేకపోవడం, KYC పెండింగ్, ఛాసిస్, వెహికల్ నంబర్లు వేర్వేరుగా ఉంటే FASTag బ్లాక్‌లిస్టులోకి వెళ్తుంది. టోల్ గేటుకు చేరుకునే సమయానికి 60min కంటే ఎక్కువ టైం FASTag ఇన్‌యాక్టివ్, బ్లాక్ లిస్టులో ఉంటే ఎర్రర్ చూపుతుంది. స్కాన్ చేసిన 10 min తర్వాత ఇన్‌యాక్టివ్‌లోకి వెళ్లినా ఆ లావాదేవీ తిరస్కరిస్తారు. అప్పుడు డబుల్ టోల్ కట్టాలి.

error: Content is protected !!