News February 13, 2025
అప్పుడు పంత్‌ను కాపాడి.. ఇప్పుడు చావుతో పోరాడుతున్నాడు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739434109952_653-normal-WIFI.webp)
2022లో ఘోర రోడ్డు ప్రమాదం నుంచి క్రికెటర్ రిషభ్ పంత్‌ను కాపాడిన యూపీ యువకుడు రజత్(21) ప్రస్తుతం చావుతో పోరాడుతున్నాడు. తమ పెళ్లికి ఇంట్లో వాళ్లు ఒప్పుకోలేదని ఈనెల 9న ప్రియురాలు మన్నూతో కలిసి అతడు విషం తాగాడు. తీవ్ర అస్వస్థతకు గురైన వారిద్దరినీ ఉత్తరాఖండ్‌లోని రూర్కీ ఆసుపత్రిలో చేర్చించారు. ఈక్రమంలోనే నిన్న మన్నూ మృతి చెందగా రజత్ పరిస్థితి విషమంగా ఉంది.
Similar News
News February 13, 2025
అమెరికా నుంచి మరో వలసదారుల విమానం?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739456656517_1045-normal-WIFI.webp)
అమెరికాకు అక్రమంగా వలసవెళ్లిన వారితో కూడిన రెండో విమానం ఈ నెల 15న పంజాబ్‌లోని అమృత్‌సర్‌కు చేరుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 5న 104మంది వలసదారుల్ని US అమృత్‌సర్‌కు పంపించిన సంగతి తెలిసిందే. మొత్తంగా 487మంది అక్రమ వలసదారుల్ని అమెరికా పంపించనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కావాలనే పంజాబ్‌ను లక్ష్యంగా చేసుకుని విమానాల్ని తమ వద్ద దించుతోందని ఆ రాష్ట్ర మంత్రి హర్పాల్ చీమా ఆరోపించారు.
News February 13, 2025
రాష్ట్రపతి పాలన ఎప్పుడు విధిస్తారు?
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739456606743_695-normal-WIFI.webp)
రాష్ట్రంలో క్లిష్ట పరిస్థితులు తలెత్తడం, రాజ్యాంగబద్ధ పాలన అందించడంలో ప్రభుత్వం విఫలమైనప్పుడు గవర్నర్ నివేదిక ఇస్తారు. దీని ఆధారంగా PM నేతృత్వంలోని మంత్రి వర్గం సిఫార్సులతో ఆర్టికల్ 356(1) ప్రకారం <<15452930>>రాష్ట్రపతి పాలన<<>> విధిస్తారు. ఆ తర్వాత పాలనా వ్యవహారాలను రాష్ట్రపతి సూచనతో గవర్నర్ పర్యవేక్షిస్తారు. ఆర్టికల్ 356(4) ప్రకారం 6నెలలు ఈ పాలన కొనసాగుతుంది. పార్లమెంటు ఆమోదంతో గరిష్ఠంగా 3ఏళ్లు విధించొచ్చు.
News February 13, 2025
2028కల్లా గగన్‌యాన్ మానవసహిత ప్రయోగం
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_22025/1739455027127_1045-normal-WIFI.webp)
గగన్‌యాన్ మానవసహిత ప్రయోగాన్ని 2028కల్లా చేపట్టనున్నట్లు శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ పార్లమెంటుకు లిఖితపూర్వక సమాధానంలో తెలిపారు. ‘గగన్‌యాన్‌లో మొత్తం 8 మిషన్స్ ఉంటాయి. వాటిలో 6 మానవరహితంగా, 2 మానవ సహితంగా ఉంటాయి. తొలి ప్రయోగాన్ని ఈ ఏడాది చేపడతాం. గగన్‌యాన్‌కు రూ.20,193 కోట్లను కేటాయించాం’ అని వివరించారు.