News February 13, 2025

BREAKING: 19 మంది మావోయిస్టుల లొంగుబాటు

image

భద్రాద్రి: నిషేధిత మావోయిస్టు పార్టీకి చెందిన 19 మంది జిల్లా పోలీసుల ఎదుట లొంగిపోయారని ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఆపరేషన్ చేయూత కార్యక్రమం ద్వారా లొంగిపోయిన మావోయిస్టుల పట్ల చూపిస్తున్న ఆదరణను చూసి స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు ప్రకటించారు. లొంగిపోయి సాధారణ జీవితం గడపటానికి వారు ముందుకు వచ్చారని ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో ఎస్పీ పరితోష్ పంకజ్, ఏఎస్పీ విక్రాంత్ పాల్గొన్నారు.

Similar News

News November 4, 2025

కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి: కలెక్టర్

image

జిల్లాను కుష్టు రహిత జిల్లాగా తీర్చిదిద్దాలని కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద మంగళవారం ఆయన కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాల గోడపత్రికను ఆవిష్కరించారు. ఈనెల 17వ తేదీ నుంచి కుష్టు వ్యాధి నివారణ పక్షోత్సవాలు మొదలవుతాయని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యరోగ్య శాఖ అధికారి దుర్గారావు దొర, తదితరులు పాల్గొన్నారు.

News November 4, 2025

కాకినాడ జిల్లాలో 20,113 హెక్టార్లలో పంట నష్టం అంచనా.!

image

కాకినాడ జిల్లాలో 20,113 హెక్టార్లలో 45 వేల మంది రైతులకు పంట నష్టం జరిగినట్లు అధికారులు నివేదిక పంపారు. దీనిపై అభ్యంతరాలు తీసుకున్నారు. బుధవారం తుది జాబితాను ప్రకటిస్తామని వ్యవసాయ శాఖ జేడీ విజయకుమార్ తెలిపారు. నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ. 10 వేలు చొప్పున పరిహారం అందుతుందని ఆయన పేర్కొన్నారు.

News November 4, 2025

రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై కమిటీ

image

TG: రాష్ట్రంలో ఫీజు రీయింబర్స్‌మెంట్ సంస్కరణలకు ప్రభుత్వం కమిటీని నియమించింది. స్పెషల్ సీఎస్ ఛైర్మన్‌గా, ప్రిన్సిపల్ సెక్రటరీ వైస్ ఛైర్మన్‌గా 15 మందితో ఈ కమిటీని ఏర్పాటు చేసింది. కాలేజీ యాజమాన్యాల నుంచి ముగ్గురికి, ప్రొఫెసర్లు కంచ ఐలయ్య, కోదండరామ్‌కు చోటు కల్పించింది. రీయింబర్స్‌మెంట్ విధానంపై ఈ కమిటీ అధ్యయనం చేయనుంది. తీసుకోవాల్సిన చర్యలపై 3 నెలల్లో తమ రిపోర్టును ప్రభుత్వానికి అందజేయనుంది.