News February 13, 2025

నిజామాబాద్‌: ప్రయోగ పరీక్ష కేంద్రాలు తనిఖీ

image

పరీక్ష కేంద్రాలలో కెమెరాలు ఆగిపోకుండా ఎప్పటికప్పుడు తనిఖీ చేస్తూ పని చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయా కళాశాలల ప్రిన్సిపల్‌లను DIEO రవికుమార్ ఆదేశించారు. గురువారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మూడో దశ ప్రయోగ పరీక్షలు ప్రారంభమయ్యాయి. కాగా పలు ప్రయోగ పరీక్షా కేంద్రాలను ఆయన గురువారం తనిఖీ చేశారు. నిబంధనల మేరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించాలని సూచించారు.

Similar News

News January 13, 2026

NZB: ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ

image

నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల నిరుద్యోగ యువతకు ఎస్సీ స్టడీ సర్కిల్‌లో ఉచిత శిక్షణ ఇస్తున్నట్లు ఎస్సీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజగంగారం తెలిపారు. ఫిబ్రవరి 20 నుంచి జూలై 19 వరకు 5 నెలల పాటు గ్రూప్-1, 2, 3, 4తో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. ఎంపికైన అభ్యర్థులకు ఉచిత వసతి, భోజన సౌకర్యం కల్పిస్తామని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు.

News January 13, 2026

NZB: బెట్టింగ్ భూతం.. తీసింది ప్రాణం

image

ఆన్‌లైన్ బెట్టింగ్‌ వ్యసనం ఓ యువకుడి ప్రాణం తీసింది. నిజామాబాద్ జిల్లా రెంజల్ మండలం కూనెపల్లికి చెందిన పెరుమండ్ల సంజయ్(28) గత కొంతకాలంగా బెట్టింగ్‌లకు బానిసై భారీగా అప్పులు చేశాడు. వాటిని తీర్చలేక, అదనపు డబ్బు కోసం తల్లిదండ్రులను వేధించేవాడు. ఉన్నకాస్తా పోవడంతో మనస్తాపానికి గురైన సంజయ్.. మంగళవారం ఇంట్లో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చేతికి అందిన కొడుకు మృతితో ఆ కుటుంబంలో విషాదం నిండింది.

News January 13, 2026

నిజామాబాద్: వారికి కలెక్టర్ హెచ్చరిక

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణికి డుమ్మా కొట్టిన అధికారులపై నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం నాటి కార్యక్రమానికి గైర్హాజరైన వారికి మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. మొదటి తప్పుగా భావించి మెమోలిస్తున్నామని, పునరావృతమైతే వేతనాల్లో కోతతో పాటు కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో సమస్యల పరిష్కారానికి అధికారులు బాధ్యతగా పనిచేయాలని స్పష్టం చేశారు.