News February 13, 2025

IPL: ఆ ఇద్దరు ఎవరో?

image

ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్, KKR జట్లకు కెప్టెన్లు ఖరారు కావాల్సి ఉంది. ఢిల్లీకి అక్షర్ పటేల్, రాహుల్ తదితర ప్లేయర్ల పేర్లు పరిశీలనలో ఉండగా కోల్‌కతాకు రసెల్, రహానే, నరైన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. మరి మేనేజ్మెంట్స్ ఎవరివైపు మొగ్గుతాయో త్వరలో తేలనుంది.
ఇతర జట్ల కెప్టెన్లు:
CSK-రుతురాజ్, గుజరాత్-గిల్, లక్నో-పంత్, పంజాబ్-శ్రేయస్, రాజస్థాన్-శాంసన్, MI-హార్దిక్, ఆర్సీబీ-రజత్ పాటిదార్, SRH-కమిన్స్.

Similar News

News January 28, 2026

394 పోస్టులు.. నేటి నుంచి దరఖాస్తుల ఆహ్వానం

image

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<>IOCL<<>>) 394 అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నేటి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. డిప్లొమా, డిగ్రీ, ఇంటర్ అర్హత గలవారు FEB 10 వరకు NATS/NAPS పోర్టల్‌‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. https://plapps.indianoilpipelines.inలో అప్లై చేసుకోవాలి. వయసు 18- 24ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.iocl.com

News January 28, 2026

12న దేశవ్యాప్త సమ్మె.. పెరుగుతున్న మద్దతు

image

కేంద్రం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్‌లను రద్దు చేయాలనే డిమాండ్‌తో FEB 12న దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరగనుంది. దీనికి తెలుగు రాష్ట్రాల్లోని కార్మిక సంఘాలు, ట్రేడ్ యూనియన్లు మద్దతు ప్రకటించాయి. తాము కూడా సమ్మెలో పాల్గొంటామని APలోని అంగన్వాడీ యూనియన్లు తెలిపాయి. TGలోని ఆర్టీసీ యూనియన్లు కూడా సమ్మె నోటీసులు అందజేశాయి. కొత్త చట్టాల వల్ల ఇబ్బందులు వస్తాయని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

News January 28, 2026

డాలర్ డౌన్.. ఆకాశానికి చేరిన చమురు ధరలు

image

US డాలర్‌ భారీగా బలహీనపడి నాలుగేళ్ల కనిష్ఠానికి చేరుకుంది. మరోవైపు ఇరాన్‌తో పెరుగుతున్న <<18971432>>ఉద్రిక్తతల<<>> నేపథ్యంలో క్రూడ్ ఆయిల్ ధరలు 4 నెలల గరిష్ఠానికి చేరుకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ ఇరాన్‌పై దాడులకు ఆదేశాలు ఇవ్వొచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితిని మార్కెట్లు నిశితంగా గమనిస్తున్నాయి. మిడిల్‌ ఈస్ట్‌లో పరిణామాలు చమురు మార్కెట్‌ను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి.