News February 13, 2025

ఎంఎల్సీ ఎన్నికలకు పకడ్బందీ ఏర్పాట్లు: కలెక్టర్

image

ఎంఎల్సీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని శాసన మండలి పట్టభద్రుల ఎన్నికల పరిశీలకులు కే.సునీత ఆదేశించారు. కంట్రోల్ రూం ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల పీఓలను, ఏపీఓలను నియమించారా? అని అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ మాట్లాడతూ.. పీఓలకు, ఏపిఓలకు, ఇతర పోలింగ్ సిబ్బంది ఈనెల 18,24 తేదీల్లో రెండు విడతల్లో శిక్షణ అందించడానికి ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News September 18, 2025

మంచిర్యాల జిల్లాలో 12.8 మి.మీ. వర్షపాతం నమోదు

image

మంచిర్యాల జిల్లాలో గడిచిన 24 గంటల్లో 12.8 మి.మీ వర్షపాతం నమోదైనట్లు అధికారులు చెప్పారు. అత్యధికంగా కాసిపేట మండలంలో 64.2 మి.మీ నమోదైంది. జన్నారం 0.4, దండేపల్లి 2.2, లక్షెట్టిపేట3.0, హాజీపూర్ 6.4,తాండూర్ 34.6, భీమిని 2.8, కన్నేపల్లి1.4, వేమనపల్లి 0.0, నెన్నల 1.0, బెల్లంపల్లి 32.0, మందమర్రి 17.2, మంచిర్యాల 29.4, నస్పూర్ 15.4, జైపూర్ 1.6, భీమారం 20.4, చెన్నూర్ 00, కోటపల్లి 00 మి.మీ. వర్షం కురిసింది.

News September 18, 2025

ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ బదిలీ

image

ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ పదోన్నతిపై బదిలీ అయ్యారు. ఆయన్ను ములుగు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీవోగా) నియమిస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన ములుగు హెడ్ క్వార్టర్‌కు బదిలీ అయ్యారు. కాగా ప్రస్తుతం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ ఏటూరునాగారం సబ్ డివిజనల్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈమేరకు బదిలీపై ఆయన ములుగు వెళ్లనున్నారు.

News September 18, 2025

రేపు మంచిర్యాలలో జిల్లా స్థాయి బోధనాభ్యసన సామగ్రి మేళా

image

మంచిర్యాలలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శుక్రవారం జిల్లా స్థాయి బోధనాభ్యసన సామగ్రి మేళా నిర్వహించనున్నట్లు డీఈఓ యాదయ్య ఈరోజు తెలిపారు. జిల్లాలోని 18 మండలాల నుంచి మండల స్థాయి టీఎల్ఎం మేళాలో ఎంపికైన 172 మంది ఉపాధ్యాయులు తమ ఎగ్జిబిట్స్‌తో హాజరు కానున్నారని పేర్కొన్నారు. బోధన అభ్యసన ప్రక్రియలో విద్యార్థులకు సులభంగా అర్థం కావడానికి ఈ మేళా ఎంతో దోహదపడుతుందన్నారు.