News March 20, 2024
HYD: కుక్కల బెడద.. నియంత్రణ ఎక్కడ..?

HYD, RR, MDCL పరిధిలో కుక్కల బెడదతో గల్లీలోని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అంబర్‌పేట, షేక్‌పేట, రాజేంద్రనగర్, అద్రాస్పల్లి, ఉప్పల్ లాంటి అనేక చోట్ల కుక్కలు వెంటపడి కరుస్తున్నాయి. ఇప్పటికీ ఎల్బీనగర్-24385, చార్మినార్-37666, ఖైరతాబాద్-8178, శేర్లింగంపల్లి-1813, కూకట్పల్లి-6901, సికింద్రాబాద్‌లో 18086 కుక్కలకు స్టెరిలైజేషన్ కాలేదు. ప్రత్యేక చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
Similar News
News April 10, 2025
HYD: నల్లాకు మోటర్ బిగిస్తే రూ.5 వేల జరిమానా!

నల్లాల నుంచి మోటార్ల ద్వారా నీటిని తోడితే కఠిన చర్యలు తీసుకుంటామని జలమండలి MD అశోక్ రెడ్డి హెచ్చరించారు. బుధవారం ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. HMWSSB ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి సుదూర ప్రాంతాల నుంచి నీటిని శుద్ధి చేసి సరఫరా చేస్తోందని, వృథా చేయకుండా వాటిని తాగునీటి అవసరాలకు మాత్రమే వినియోగించాలని కోరారు. నల్లాకు మోటర్ బిగిస్తే రూ.5 వేల జరిమానా విధిస్తామన్నారు.
News April 9, 2025
HYD: మెట్రో రైల్ ఎండీగా ఎన్వీఎస్ రెడ్డి

మెట్రో రైల్ ఎండీగా NVS రెడ్డికి ప్రభుత్వం మళ్లీ అవకాశం కల్పించింది. కీలకమైన రెండో దశ ప్రాజెక్టులో ఆయన సేవలను వినియోగించుకోవాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి కీలక విషయాలపై ఆయనకు అవగాహన ఉందని, అందుకే ఆయన్ని ఆ పదవిలో కొనసాగించినట్లు సమాచారం. ఈ మేరకు ఉత్తర్వులు విడుదల చేశారు.
News April 9, 2025
HYD: అక్కడ అన్ని పుస్తకాలు చవక..!

HYDలోని సురవరం ప్రతాపరెడ్డి యూనివర్సిటీ నాంపల్లి గ్రౌండ్లో పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. ఏప్రిల్ 17వ తేదీ వరకు కొనసాగుతుందని, ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అందుబాటులో ఉన్నట్లుగా అధికారులు తెలిపారు. సాహిత్యం, నాట్యం, సంగీతం, జీవితచరిత్రలు, ఆదివాసి జీవన విధానం, అనేక పరిశోధన గ్రంథాలకు సంబంధించిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.