News February 13, 2025

NLG: ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు

image

వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణలో భాగంగా గురువారం ముగ్గురు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీంతో వరంగల్- ఖమ్మం- నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు నిలిచారు. బరిలో ఎక్కువమంది పోటీ పడుతుండడంతో ఎన్నిక రసవత్తరం కానుందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.

Similar News

News January 13, 2026

రైతన్నకు తప్పని ‘యూరియా’ కష్టాలు

image

జిల్లాలో యాసంగి వరి నాట్లు ముమ్మరంగా సాగుతున్న వేళ, ఎరువుల కొరత రైతులను వేధిస్తోంది. ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్‌ ద్వారానే యూరియా తీసుకోవాలన్న నిబంధన రైతులకు ఇబ్బందిగా మారింది. కేవలం PACS, మన గ్రోమోర్ కేంద్రాల్లోనే స్టాక్ ఉండటం, ప్రైవేటు డీలర్లు అమ్మకాలు నిలిపివేయడంతో యూరియా దొరకడం గగనమైంది. పొలాలకు ఎరువులు వేయాల్సిన సమయంలో గంటల తరబడి లైన్లలో నిలబడాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News January 13, 2026

నల్గొండ: జిల్లాలో ఆరు ‘యంగ్‌ ఇండియా’ పాఠశాలలు

image

NLG జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ‘యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్‌ పాఠశాలల’ నిర్మాణానికి భూములను గుర్తించినట్లు కలెక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నిర్వహించిన సమీక్షలో మాట్లాడారు. NLG, మునుగోడులో పనులు ప్రారంభమయ్యాయని, మిగిలిన చోట్ల టెండర్లు పూర్తయ్యాయని వెల్లడించారు. వచ్చే ఏడాది కల్లా స్కూల్స్‌ను విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

News January 13, 2026

నల్గొండ: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై కలెక్టర్ ఫోకస్

image

ప్రజావాణిలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించేందుకు కలెక్టర్ చంద్రశేఖర్ చర్యలు ముమ్మరం చేశారు. గతవారం జిల్లాలో 4,600 ఫిర్యాదులు పెండింగ్‌లో ఉండగా, అధికారుల కృషితో ఈ వారం నాటికి ఆ సంఖ్య 1,699కి తగ్గింది. వచ్చే వారం నాటికి పెండింగ్ ఫిర్యాదుల సంఖ్యను 500 లోపుకు తీసుకురావాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించవద్దని ఆయన స్పష్టం చేశారు.