News February 13, 2025
వరంగల్: కొత్త రకం మిర్చి ధరల వివరాలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్‌లో వివిధ రకాల కొత్త రకం మిర్చి ధరలు తరలివచ్చాయి. ఈ క్రమంలో ధరలు వివరాలు చూస్తే.. 5,531 మిర్చి రూ.10,800, దీపిక మిర్చి రూ.16,300, అకిరా బ్యాగడి రూ.11 వేల ధర పలికాయి. అలాగే 2043 రకం మిర్చి రూ.13,500, S10 మిర్చి రూ.11 వేలు ధర వచ్చినట్లు వ్యాపారులు తెలిపారు.
Similar News
News September 19, 2025
పోలీస్ కస్టడీకి మిథున్ రెడ్డి.. విజయవాడకు తరలింపు

AP: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టయి రాజమండ్రి జైలులో ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని సిట్ అధికారులు విజయవాడకు తరలించారు. ఆయన్ను 5 రోజులపాటు కస్టడీకి ఇవ్వాలని సిట్ కోరగా కోర్టు 2 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో ఆయన్ను అధికారులు ఇవాళ, రేపు విచారించనున్నారు. ఈ కేసులో మిథున్ రెడ్డి ఏ4గా ఉన్న విషయం తెలిసిందే.
News September 19, 2025
గజ్వేల్: కొమ్మ కొమ్మకో గూడు..

గజ్వేల్‌లో ఈత చెట్టు కొమ్మలకు ఉన్న గూళ్లు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. పక్షులు అద్భుత నైపుణ్యంతో కట్టుకున్న ఈ గూళ్లు వద్ద సందడి చేస్తున్నాయి. ఈ దృశ్యం పర్యావరణ పరిరక్షణ, జీవవైవిధ్యం ఆవశ్యకతను గుర్తుచేస్తుంది. గజ్వేల్ పట్టణం నుంచి సంగాపూర్ వెళ్లే దారిలో గజ్వేల్ బాలికల విద్యాసౌధం సమీపంలో ఈత చెట్టు కొమ్మలకు పక్షులు కట్టుకున్న గూళ్లు కనువిందు చేస్తున్నాయి.
News September 19, 2025
దర్శి: విద్యార్థి మృతి.. బస్సుల నిలిపివేత

దర్శి మండలం తూర్పు చౌటపాలెంలో నిన్న రోడ్డు ప్రమాదం జరిగింది. బైకుపై వెళ్తున్న ముగ్గురిని ఓ స్కూల్ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో చౌటపాలేనికి చెందిన ఇంటర్ విద్యార్థి యేసురాజు(17) మృతిచెందాడు. దీంతో ఇవాళ ఉదయం గ్రామానికి వచ్చిన ప్రైవేట్ స్కూల్ బస్సులను ఎస్సీ కాలనీవాసులు అడ్డుకున్నారు. విద్యార్థి కుటుంబానికి న్యాయం జరిగే వరకు బస్సులను గ్రామం నుంచి పంపించబోమన్నారు.