News February 13, 2025

జాతీయస్థాయి కబడ్డీ పోటీలకు సిద్దిపేట ‘రాణి’

image

జాతీయ స్థాయి మహిళా కబడ్డీ పోటీలకు సిద్దిపేట జిల్లాకు చెందిన క్రీడాకారిణి రాణి ఎంపికైనట్లు సిద్దిపేట జిల్లా కబడ్డీ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ శివకుమార్ తెలిపారు. ఇటీవల జరిగిన సెలక్షన్స్‌లో రాష్ట్ర కబడ్డీ జట్టులో రాణి చోటు దక్కించుకుందని చెప్పారు. ఈ సందర్భంగా ఈనెల 14 నుంచి 18వ తేదీ వరకు హరియాణాలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో రాణి పాల్గొంటుందని పేర్కొన్నారు.

Similar News

News February 14, 2025

నర్సాపూర్ (జి): వ్యక్తిపై హత్య ప్రయత్నం కేసు నమోదు: SI

image

పాత కక్షలతో ఓ వివాహితను హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటన గురువారం నర్సాపూర్(జి) మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్సై సాయి కిరణ్ వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గడ్డం ఎల్లన్న పాత కక్షలు మనసులో పెట్టుకుని అదే గ్రామానికి చెందిన ఓ వివాహితను ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో పొడిచాడు. వివాహిత భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

News February 14, 2025

సిరిసిల్ల: పిల్లలకు భయం పోగొట్టేందుకు SPECIAL క్లాసులు

image

జిల్లాలోని షెడ్యూల్డ్, వెనుకబడిన తరగతుల 10వ తరగతి విద్యార్థులకు పరీక్షలు భయం పోగొట్టడానికి సిరిసిల్ల పట్టణంలోని టీజీఎస్సీ స్టడీ సర్కిల్‌లో అవగాహన తరగతులు నిర్వహిస్తున్నట్టు జిల్లా షెడ్యూల్డ్, వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రాజ మోహన్ రావు తెలిపారు. ఆసక్తికర విద్యార్థులు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే తరగతులకు హాజరుకావాలని ఆయన కోరారు.

News February 14, 2025

పెద్దపల్లి: జిల్లా స్థాయి సబ్ జూనియర్ బాల బాలికల కబడ్డీ పోటీలు

image

పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈనెల 15న శనివారం కబడ్డీ అసోసియేషన్ ఆధ్వర్యంలో సబ్ జూనియర్ బాల బాలికల కబడ్డీ పోటీలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ కార్యదర్శి గుజ్జుల కరుణాకర్ రెడ్డి తెలిపారు. పోటీల్లో పాల్గొనే క్రీడాకారులు ఉదయం 9 గంటలకు ఒర్జినల్ ఆధార్ కార్డుతో హాజరుకావాలని, బాలురు 55 కేజీల బరువు, బాలికలు 55 కేజీల బరువు ఉండాలని అన్నారు.

error: Content is protected !!