News February 13, 2025

జగిత్యాల: మాటలకే పరిమితం కావొద్దు: MLC జీవన్ రెడ్డి

image

రాజకీయ పార్టీ నాయకులు మాటలకు పరిమితంగా కాకూడదని, చేతల్లో నిరూపించాలని కాంగ్రెస్ MLC జీవన్ రెడ్డి అన్నారు. జగిత్యాలలోని ఇందిరా భవన్‌లో ప్రభుత్వ విప్ లక్ష్మణ్‌తో కలిసి గురువారం నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. బండి సంజయ్ మత విద్వేషాలను రెచ్చగొట్టే పని చేయకుండా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి బీసీలకు 42 శాతం రిజర్వేషన్ వచ్చేలా సహకరించాలని కోరారు. రిజర్వేషన్లను మతంతో ముడిపెట్టడం సరికాదన్నారు.

Similar News

News February 14, 2025

చిన్నారెడ్డి పుదుచ్చేరి సెంటిమెంట్.!

image

రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి గతంలో పుదుచ్చేరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జిగా ఉన్న సమయంలో ఎన్నికలలో పార్టీ గెలుపొంది అధికారం చేపట్టింది. దీంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చిన్నారెడ్డిని సెంటిమెంట్‌గా భావిస్తారు. పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో HYDలోని ప్రజాభవన్‌లో ఆ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి కందస్వామి చిన్నారెడ్డితో భేటీ అయ్యారు. 

News February 14, 2025

ఉప్పునుంతల: 21తేది నుంచి వెల్టుర్‌లో ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు

image

ఉప్పునుంతల మండలంలోని వెల్టుర్ గ్రామంలో ఈనెల 21తేది నుంచి ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు నర్సయ్య, దుర్గయ్య, బాల్ చంద్రి, నిరంజన్, లక్ష్మయ్య తెలిపారు. ఉత్సవాలలో భాగంగా 25తేదీన అమ్మవారి కళ్యాణం, 26 తేదీన బోనాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరారు. 

News February 14, 2025

NZB: పొలంలో పడి రైతు మృతి

image

పొతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన సొన్ కాంబ్లె రమేశ్(35) గురువారం ఉదయం పొలంలో మందు చల్లడానికి వెళ్లి పడి మృతి చెందినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. మందు సంచిని తలపై పెట్టుకుని గట్టు పైన నడుస్తూ ఉండగా కాలుజారి ప్రమాదవశాత్తు బురదలో పడి ఊపిరి ఆడక మృతి చెందినట్లు పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.

error: Content is protected !!