News February 13, 2025
పెద్దేముల్: సెలవు ఇవ్వాలని డిమాండ్
ఫిబ్రవరి 15న శ్రీసంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి రోజు సెలవు ప్రకటించాలని తెలంగాణ గిరిజన ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి నేనావత్ రవికుమార్, మండల అధ్యక్షుడు శంకర్ నాయక్ అన్నారు. గురువారం పెద్దేముల్ తహశీల్దార్ వెంకటేశ్ ప్రసాద్‌కు వినతిపత్రం అందజేశారు. దేశంలో 15 కోట్ల మంది, రాష్ట్రంలో 40 లక్షలమంది లంబాడీలు ఉన్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బుజ్జమ్మ, గోవింద్ నాయక్, సవిత తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 14, 2025
చిన్నారెడ్డి పుదుచ్చేరి సెంటిమెంట్.!
రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి గతంలో పుదుచ్చేరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఎన్నికలలో పార్టీ గెలుపొంది అధికారం చేపట్టింది. దీంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చిన్నారెడ్డిని సెంటిమెంట్‌గా భావిస్తారు. పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో HYDలోని ప్రజాభవన్‌లో ఆ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి కందస్వామి చిన్నారెడ్డితో భేటీ అయ్యారు.
News February 14, 2025
ఉప్పునుంతల: 21తేది నుంచి వెల్టుర్‌లో ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు
ఉప్పునుంతల మండలంలోని వెల్టుర్ గ్రామంలో ఈనెల 21తేది నుంచి ఎల్లమ్మ తల్లి ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు కమిటీ సభ్యులు నర్సయ్య, దుర్గయ్య, బాల్ చంద్రి, నిరంజన్, లక్ష్మయ్య తెలిపారు. ఉత్సవాలలో భాగంగా 25తేదీన అమ్మవారి కళ్యాణం, 26 తేదీన బోనాలు నిర్వహిస్తామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఉత్సవాలు జయప్రదం చేయాలని కోరారు.
News February 14, 2025
NZB: పొలంలో పడి రైతు మృతి
పొతంగల్ మండలం హెగ్డోలి గ్రామానికి చెందిన సొన్ కాంబ్లె రమేశ్(35) గురువారం ఉదయం పొలంలో మందు చల్లడానికి వెళ్లి పడి మృతి చెందినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. మందు సంచిని తలపై పెట్టుకుని గట్టు పైన నడుస్తూ ఉండగా కాలుజారి ప్రమాదవశాత్తు బురదలో పడి ఊపిరి ఆడక మృతి చెందినట్లు పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు.