News February 13, 2025

కామారెడ్డి: వాలంటైన్స్‌డే బజరంగ్‌దళ్, వీహెచ్పీ హెచ్చరిక

image

కామారెడ్డి జిల్లాలో ఫిబ్రవరి 14 ప్రేమికుల రోజు సందర్భంగా భజరంగ్‌దళ్, వీహెచ్పీ కార్యకర్తలు కీలక ప్రకటన చేశారు. పాశ్చాత్య దేశాల సంప్రదాయాలు ప్రభావం మనదేశంలో పడకుండా చూడాలని కోరారు. ప్రేమ ముసుగులో వికృత చేష్టలు చేపడుతున్న యువతకు కళ్ళు తెరిపించి మంచి బుద్ధితో ఉండాలని సూచించారు. దేశ సేవకు ముందుకు రావాలని కోరారు. యువత, స్టూడెంట్ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు చేపట్టడానికి వీలుండదని హెచ్చరించారు.

Similar News

News July 9, 2025

ఆరు బయట చెత్తను వేస్తే.. పరువు పోవడం పక్కా!

image

బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయొద్దనే ఉద్దేశంతో మున్సిపాలిటీలు ఇంటింటికీ వెళ్లి చెత్తను కలెక్ట్ చేస్తుంటాయి. అయినప్పటికీ కొందరు బయటే చెత్త వేసి ఇతరులను ఇబ్బంది కలగజేస్తుంటారు. అలాంటివారికి బుద్ధి చెప్పాలని గుజరాత్‌లోని వడోదరా మున్సిపాలిటీ అధికారులు వినూత్నంగా ఆలోచించారు. రోడ్డు పక్కన చెత్త వేసేవారి ఫొటోలను తీసి పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఇలా అయినా ప్రజలకు ఈ అలవాటును మార్చుకుంటారో లేదో చూడాల్సి ఉంది.

News July 9, 2025

రేపు తల్లిదండ్రులు ఆడే ఆటలు ఇవే..

image

జిల్లా విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఉన్న 1,810 ప్రభుత్వ, 558 ప్రైవేటు స్కూల్స్, 140 జూనియర్ కాలేజీల విద్యార్థులకు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 వరకు మెగా PTM జరుగుతుందన్నారు. వక్తృత్వ, వ్యాసరచన, చిత్రలేఖన పోటీలు నిర్వహించాలన్నారు. తల్లిదండ్రులకు లెమన్ అండ్ స్పూన్, మ్యూజికల్ చైర్, టగ్ ఆఫ్ వార్ వంటి పోటీలు ఉంటాయన్నారు.

News July 9, 2025

14న భూపాలపల్లిలో అప్రెంటిస్‌షిప్ మేళా

image

ప్రధానమంత్రి జాతీయ అప్రెంటిస్‌షిప్ మేళా(PMNAM)ను ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో ఈ నెల 14న నిర్వహించనున్నట్లు ప్రిన్సిపల్ జుమ్లా నాయక్ తెలిపారు. ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆసక్తి ఉన్న వారు తప్పనిసరిగా www.apprenticeshipindia.gov.in పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు.