News February 13, 2025

పర్యాటక శాఖ ద్వారా శ్రీవారి దర్శనాలు

image

AP: తిరుమల శ్రీవారి భక్తులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పర్యాటక శాఖ ద్వారా దర్శన సౌకర్యాలను పునరుద్ధరించాలని CM చంద్రబాబు నిర్ణయించారు. గతంలో ₹300 టికెట్లను వివిధ రాష్ట్రాల టూరిజం విభాగాలకు, RTCలకు కేటాయించేవారు. వీటిని బ్లాక్‌లో ఎక్కువ రేట్లకు విక్రయిస్తున్నారనే ఆరోపణలతో TTD రద్దు చేసింది. ఇప్పుడు పూర్తిగా AP పర్యాటక శాఖ ఆధ్వర్యంలోనే దర్శనం కల్పించనుంది. విధివిధానాలపై త్వరలో క్లారిటీ రానుంది.

Similar News

News February 14, 2025

భారత్‌ది ఎప్పుడూ ‘శాంతి’ పక్షమే: మోదీ

image

రష్యా, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థంగా ఉందని ప్రపంచం అనుకుంటోందని ప్రధాని మోదీ అన్నారు. కానీ భారత్ ఎప్పుడూ శాంతివైపే ఉంటుందని చెప్పారు. పుతిన్‌తో ట్రంప్ చర్చలు జరపడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. తనలాగే ట్రంప్‌కు కూడా దేశమే తొలి ప్రాధాన్యమని, ఇరుదేశాలు మరింత బలోపేతమై ఇంకా ఎత్తుకు ఎదగాలన్నదే తన ఆశ అని పేర్కొన్నారు.

News February 14, 2025

పరీక్షల కన్నా జీవితం పెద్దది: అదానీ

image

JEEలో ఫెయిల్ అయినందుకు UPలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై గౌతమ్ అదానీ విచారం వ్యక్తం చేశారు. ‘పరీక్షల కంటే జీవితం పెద్దది. ఈ విషయాన్ని పేరెంట్స్ అర్థం చేసుకుని పిల్లలకు వివరించాలి. నేను కూడా చదువులో, జీవితంలో చాలాసార్లు ఫెయిలయ్యాను. కానీ ప్రతీసారి జీవితం నాకు కొత్త మార్గాన్ని చూపింది. వైఫల్యాన్ని మీ చివరి గమ్యస్థానంగా పరిగణించవద్దు. లైఫ్ ఎప్పుడూ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది’ అని ట్వీట్ చేశారు.

News February 14, 2025

WPL-2025కు వేళాయె.. నేడే తొలి మ్యాచ్

image

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2025 ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. నేడు తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. వడోదర వేదికగా రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు. 5 జట్లు పాల్గొనే ఈ టీ20 లీగ్ 2023లో ప్రారంభమైంది. తొలి సీజన్‌లో ముంబై ఇండియన్స్, రెండో సీజన్‌లో RCB విజేతలుగా నిలిచాయి.

error: Content is protected !!