News February 14, 2025

ఎల్లుండి OTTలోకి కిచ్చా సుదీప్ ‘మ్యాక్స్’

image

కన్నడ హీరో కిచ్చా సుదీప్ నటించిన యాక్షన్ మూవీ ‘మ్యాక్స్’ ఈ నెల 15న ఓటీటీలోకి రానుంది. తెలుగు, కన్నడ, మలయాళ, తమిళ భాషల్లో జీ5లో అందుబాటులో ఉండనుంది. ఫిబ్రవరి 22న రిలీజ్ చేస్తామని గతంలో చెప్పిన సంస్థ వారం ముందుగానే స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించి సర్‌ఫ్రైజ్ ఇచ్చింది. అదే రోజు రాత్రి 7.30కు జీ కన్నడ ఛానల్‌లో ప్రసారం చేస్తామని పేర్కొంది. DEC 25న విడుదలై ఈ చిత్రం దాదాపు రూ.65 కోట్లు కలెక్ట్ చేసింది.

Similar News

News July 6, 2025

మహబూబ్‌నగర్ జిల్లాలో చిరుత సంచారం

image

మహమ్మదాబాద్ మండలం గాధిర్యాల్ అటవీ ప్రాంతంలోని కొణెంగల గుట్టపై చిరుత సంచారం రైతులను భయాందోళనకు గురిచేస్తోంది. చిరుత సంచారంపై 4 రోజులుగా అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చినా స్పందన లేదని రైతులు అన్నారు. శనివారం గుట్టలోని గుండుపై చిరుత కనిపించగా పొలాల వద్ద పశువులు ఉండటంతో ఆందోళన చెందుతున్నారు. అప్పటికైనా అటవీ అధికారులు స్పందించి చిరుతను పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

News July 6, 2025

కేసీఆర్ పాలనలో రైతు ఆత్మహత్యలు తగ్గాయి: హరీశ్ రావు

image

TG: పదేళ్ల KCR పాలనలో రైతు ఆత్మహత్యలు రికార్డు స్థాయిలో తగ్గాయని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. దేశ వ్యాప్తంగా 2015-2022 మధ్య నమోదైన రైతు ఆత్మహత్యల డేటాను ఆయన షేర్ చేశారు. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు 2015లో 11.1% ఉండగా 2022 నాటికి 1.57%కి తగ్గినట్లు తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా పథకాలు, కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుల నిర్మాణంతో పలు కార్యక్రమాల వల్లే ఇది సాధ్యమైందన్నారు.

News July 6, 2025

4 బంతుల్లో 3 వికెట్లు

image

మేజర్ లీగ్‌ క్రికెట్‌లో ఆడమ్ మిల్నే అదరగొట్టారు. సియాటెల్ ఆర్కాస్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి టెక్సాస్ విజయంలో కీలకపాత్ర పోషించారు. 19వ ఓవర్‌లో తొలి 2 బంతులకు 2 వికెట్లు పడగొట్టిన అతడు 4వ బంతికి మరో వికెట్ తీసి సియాటెల్‌ను ఆలౌట్ చేశారు. దీంతో మొత్తం ఆ ఓవర్‌లో 4 బంతుల్లోనే 3 వికెట్లు పడగొట్టారు. తొలుత బ్యాటింగ్‌కు దిగిన టెక్సాస్ 188 రన్స్ చేయగా ఛేజింగ్‌లో సియాటెల్ 137 పరుగులకే కుప్పకూలింది.