News February 14, 2025
ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది గైర్హాజర్
జనగామ జిల్లాలో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం ప్రాక్టికల్ పరీక్షలకు 90 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఐఈఓ జితేందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. మొదటి సెషన్‌లో 644 మంది విద్యార్థులకు గాను 577 మంది హాజరయ్యారని, రెండో సెషన్‌లో జరిగిన పరీక్షకు 492 మంది విద్యార్థులకు 469 మంది విద్యార్థులు హాజరైనట్లు వెల్లడించారు.
Similar News
News February 14, 2025
పరీక్షల కన్నా జీవితం పెద్దది: అదానీ
JEEలో ఫెయిల్ అయినందుకు UPలో ఓ విద్యార్థిని ఆత్మహత్య చేసుకోవడంపై గౌతమ్ అదానీ విచారం వ్యక్తం చేశారు. ‘పరీక్షల కంటే జీవితం పెద్దది. ఈ విషయాన్ని పేరెంట్స్ అర్థం చేసుకుని పిల్లలకు వివరించాలి. నేను కూడా చదువులో, జీవితంలో చాలాసార్లు ఫెయిలయ్యాను. కానీ ప్రతీసారి జీవితం నాకు కొత్త మార్గాన్ని చూపింది. వైఫల్యాన్ని మీ చివరి గమ్యస్థానంగా పరిగణించవద్దు. లైఫ్ ఎప్పుడూ సెకండ్ ఛాన్స్ ఇస్తుంది’ అని ట్వీట్ చేశారు.
News February 14, 2025
ADB: ‘కేంద్రమంత్రి అశ్విన్ కుమార్‌ను కలిసిన ఎంపీ నగేశ్’
కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని కుమార్‌ను ఎంపీ నగేశ్ ఢిల్లీలో గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఆర్మూర్ నుంచి ADB వరకు వయా నిర్మల్ రైల్వేలైన్, నాందేడ్ నుంచి కొన్ని రైళ్లను ADB వరకు పొడిగించాలని కోరారు. భాగ్యనగర్ ఎక్స్‌ప్రెస్‌ను సిర్పూర్(టి) వరకు పొడిగించాలని, కాజీపేట నుంచి హౌరాకు పెద్దపల్లి, మంచిర్యాల, కాగజ్‌నగర్ మీదుగా కొత్త రైలు వేయాలని కోరగా.. సానుకూలంగా స్పందించినట్లు నగేశ్ పేర్కొన్నారు.
News February 14, 2025
WPL-2025కు వేళాయె.. నేడే తొలి మ్యాచ్
ఉమెన్స్ ప్రీమియర్ లీగ్-2025 ఇవాళ్టి నుంచి ప్రారంభం కానుంది. నేడు తొలి మ్యాచ్‌లో గుజరాత్ జెయింట్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. వడోదర వేదికగా రా.7.30కి మ్యాచ్ ప్రారంభమవుతుంది. స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్ చూడవచ్చు. 5 జట్లు పాల్గొనే ఈ టీ20 లీగ్ 2023లో ప్రారంభమైంది. తొలి సీజన్‌లో ముంబై ఇండియన్స్, రెండో సీజన్‌లో RCB విజేతలుగా నిలిచాయి.