News February 14, 2025
గిన్నిస్ రికార్డుకు ప్రయత్నిస్తూ భారతీయుడి మృతి

భారత్‌లోని మీరట్‌కు చెందిన మోహిత్ కోహ్లీ అనే సైక్లిస్ట్ చిలీలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. 10వేల కి.మీ దూరాన్ని సైకిల్‌పై అత్యంత వేగంగా ప్రయాణించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాలని భావించిన ఆయన దక్షిణ అమెరికాలో కొలంబియా నుంచి అర్జెంటీనాకు సైకిల్‌పై బయలుదేరారు. కొలంబియా, పెరూ, ఈక్వెడార్ దాటిన ఆయన చిలీలో ఓ బస్సు ఢీ కొనడంతో అక్కడికక్కడే మరణించారు. ఈ వార్తతో మీరట్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Similar News
News September 17, 2025
ఇప్పటికే అనేక రంగాల్లో GST ప్రయోజనాలు: నిర్మల

AP: 140కోట్ల మందికి వర్తించే GSTపై పెద్ద నిర్ణయం తీసుకున్నామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. GST కౌన్సిల్ నిర్ణయాలు ఈ నెల 22నుంచి అమల్లోకి వస్తాయని చెప్పారు. ఇప్పటికే అనేక రంగాలు ప్రయోజనాలు పొందుతున్నాయని విశాఖలో GST సంస్కరణల సమావేశంలో తెలిపారు. ‘12శ్లాబ్‌లో ఉండే 99శాతం వస్తువులు 5% GST పరిధిలోకి తెచ్చాం. 28 శ్లాబ్‌లో ఉండే వస్తువులు దాదాపు 90శాతం 18% పరిధిలోకి వచ్చేశాయి’ అని వివరించారు.
News September 17, 2025
విలీనం కాకపోతే TG మరో పాక్‌లా మారేది: బండి

TG: సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోతే తెలంగాణకు విముక్తి కలిగేది కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ‘భారత్‌లో TG విలీనం కాకుంటే మరో పాక్, శ్రీలంక, బంగ్లాదేశ్‌లా ఆకలి కేకలతో కల్లోల దేశంగా మారేది. జలియన్ వాలాబాగ్‌ను మించి పరకాల, బైరాన్‌పల్లి, గుండ్రాంపల్లిలో రజాకార్లు రక్తపాతం సృష్టించారు. ఈ దురాగతాలను చరిత్రకారులు విస్మరించారు. రాష్ట్ర ప్రభుత్వం విమోచన ఉత్సవాలను నిర్వహించాలి’ అని డిమాండ్ చేశారు.
News September 17, 2025
వేగంలో రారాజు.. మెట్లు ఎక్కడానికి ఆయాస పడుతున్నారు!

ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన వ్యక్తిగా పేరొందిన ఒలింపిక్ స్ప్రింటర్ ఉసేన్ బోల్ట్ ఇప్పుడు ఫిట్‌నెస్ కోల్పోయి ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మెట్లు ఎక్కడానికి కూడా ఆయాస పడుతున్నట్లు ఆయన తెలిపారు. అందుకే తన శ్వాసను మెరుగుపరచుకోవడానికి మళ్లీ పరిగెత్తడం ప్రారంభిస్తానని ఆయన పేర్కొన్నారు. 2017లో రిటైర్ అయినప్పటి నుంచీ వ్యాయామం చేయకుండా సినిమాలు చూస్తూ పిల్లలతో గడుపుతున్నానని చెప్పారు.