News February 14, 2025
MNCL: JEE ఫలితాల్లో 12మంది గురుకుల విద్యార్థుల సత్తా

బెల్లంపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్సీ విద్యార్థులు జేఈఈ అడ్వాన్స్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ చూపారు. మొత్తం 39 విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా 12 మంది విద్యార్థులు ఎంపికైనట్లు ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు. గురువారం పాఠశాలలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎంపికైన విద్యార్థులను అభినందించారు.
Similar News
News November 9, 2025
తెనాలి: రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

తెనాలి రైల్వే స్టేషన్ సమీపంలోని నార్త్ క్యాబిన్ వద్ద గుర్తు తెలియని వ్యక్తి రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం పట్టాలపై మృతదేహాన్ని గుర్తించిన సిబ్బంది GRP ఎస్సై వెంకటాద్రికి సమాచారం అందించారు. తెల్లవారుజామున ఈ ఘటన జరిగి ఉంటుందని ప్రాథమిక విచారణలో తేలింది. తల, కాలు కట్ అయ్యి మృతదేహం భయానకంగా ఉందని స్థానికులు అన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
News November 9, 2025
గుంజీలు తీయడం పనిష్మెంట్ కాదు!

గుంజీలు తీయడం అంటే పనిష్మెంట్ అనుకుంటారు. కానీ వాటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గుంజీలు తీస్తే పొత్తి కడుపు, పేగు కండరాలు బలంగా తయారవుతాయి. మలబద్ధకం, గ్యాస్, అజీర్తి వంటి సమస్యలు దరిచేరవు. ఎక్కువ సమయం కూర్చుని పనిచేసే వాళ్లు రోజూ 30 గుంజీలు తీస్తే వెన్నునొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. శరీరంలోని కొవ్వు కూడా తేలికగా కరిగి బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. గుండెపై ఒత్తిడి తగ్గుతుంది. SHARE IT.
News November 9, 2025
వంజంగి మేఘాలకొండను సందర్శించిన కలెక్టర్

వంజంగి మేఘాలకొండ అందాలను కలెక్టర్ ఏ.ఎస్.దినేశ్ కుమార్ ఆస్వాదించి సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యారు. ఆదివారం తెల్లవారుజామున కుటుంబ సభ్యులతో వంజంగి కొండపైకి చేరుకున్నారు. మంచు మేఘాలను చీల్చుకుంటూ వచ్చే సూర్యోదయ కిరణాలు, మంచు మేఘాల అందాలను వారు తిలకించారు. కాగా వీకేండ్ కావడం, రెండు రోజుల సెలవుతో పర్యాటకులు పెద్ద సంఖ్యలో వంజంగి వచ్చి సందడి చేస్తున్నారు.


