News March 20, 2024
ఐపీఎల్, పీఎస్ఎల్ ప్రైజ్ మనీ ఎంతంటే…

IPLకు పోటీగా పాక్ క్రికెట్ బోర్డు PSLను ప్రారంభించిన సంగతి తెలిసిందే. మరి ఈ రెండు టోర్నీల్లో ప్రైజ్ మనీ తేడా ఎంత? ఐపీఎల్‌లో గత ఏడాది విజేతలకు రూ. 20 కోట్ల ప్రైజ్‌మనీ దక్కింది. రన్నరప్‌కు రూ.13 కోట్లు లభించాయి. అదే పీఎస్ఎల్‌లో ఇటీవల విజేతలుగా నిలిచిన ఇస్లామాబాద్ యునైటెడ్‌కు మన కరెన్సీలో రూ. 4.15 కోట్లు దక్కాయి. WPLలో ఆర్సీబీకి వచ్చిన ప్రైజ్‌మనీ(రూ.6 కోట్లు) అంతకంటే ఎక్కువే కావడం ఆసక్తికరం.
Similar News
News March 10, 2026
యుద్ధం.. పడిపోతున్న బియ్యం ధరలు

మిడిల్ ఈస్ట్‌లో యుద్ధం వరి రైతులపైనా ప్రభావం చూపుతోంది. చెన్నై పోర్టు నుంచి ఆఫ్రికన్ దేశాలకు బియ్యం ఎగుమతులు ఆగిపోగా, ఇప్పటికే బయల్దేరిన కంటైనర్లూ వెనక్కి వచ్చేశాయి. దీంతో వారం కిందటి వరకు పుట్టి(850KG) ధాన్యం ధర ₹22,500 ఉండగా ప్రస్తుతం ₹21Kకు పడిపోయింది. ఇంకొన్ని రోజులు ఎక్స్‌పోర్ట్స్ నిలిచిపోతే రేట్లు మరింత పతనం కానున్నాయి. అలాగే $11.8Bn విలువైన ఆహారోత్పత్తుల ఎగుమతులపైనా ప్రభావం పడనుందని అంచనా.
News March 10, 2026
ఫైళ్ల దహనం వెనకున్న ప్లాన్ ఏంటో తేలాలి: సుప్రీంకోర్టు

AP: మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగిన ఫైళ్ల దహనం తీవ్రమైన నేరమని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. రికార్డు రూమ్‌లో మంటలు ఎలా అంటుకున్నాయి? దాని వెనకున్న ప్లాన్ ఏంటో లోతుగా విచారించాల్సి ఉందని తెలిపింది. ఈ కేసులో మాజీ మంత్రి పెద్దిరెడ్డి అనుచరుడు మాధవరెడ్డి సహా ఇతర నిందితుల ముందస్తు బెయిల్‌కు నిరాకరించింది. ఘటన సమయంలో నిందితుడు విదేశాల్లో ఉన్నారనే కారణంతో విచారణ నుంచి తప్పించుకోలేరని పేర్కొంది.
News March 10, 2026
ఈనెల 16 నుంచి వర్షాలు: వాతావరణ నిపుణులు

TG: రాష్ట్రంలో మరోసారి అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నెల 16 నుంచి 23 వరకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వడగళ్ల వర్షం పడే ఛాన్సుందని పేర్కొన్నారు. మరోవైపు రాష్ట్రంలో ఈ నెల 15 వరకు పొడి వాతావరణం ఉంటుందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 33-40 డిగ్రీలుగా నమోదవుతున్నాయి.


