News February 14, 2025
టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోండి: DEO

ఈ నెల 19 నుంచి 22వ వరకు టెక్నికల్ సర్టిఫికెట్ కోర్స్ (డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ లోయర్, హైయ్యర్ గ్రేడ్) పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గుంటూరు డీఈవో సి.వి రేణుక ఒక ప్రకటనలో తెలిపారు.www.bseap.org వెబ్సైట్లో హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు. గుంటూరు నగరంలోని స్టాల్ స్కూల్, చలమయ్య సాధు సుబ్రహ్మణ్యం పాఠశాలల్లో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు.
Similar News
News February 19, 2025
ANU: BED పరీక్షల కేంద్రాన్ని తనిఖీ చేసిన అధికారులు

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలో మంగళవారం నుంచి బీ.ఫార్మసీ పరీక్షలు ప్రారంభమయ్యాయి. విశ్వవిద్యాలయం పరిధిలోని ఉమ్మడి గుంటూరు జిల్లాలో 16, ప్రకాశం జిల్లాలో మూడు కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. ఈ మేరకు విశ్వవిద్యాలయం పీజీ అండ్ ప్రొఫెషనల్ కోర్సుల పరీక్షల సమన్వయకర్త ఎం.సుబ్బారావు నాగార్జున వర్సిటీ ఫార్మసీ కళాశాలలో జరుగుతున్న పరీక్షలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లు పరిశీలించారు.
News February 18, 2025
గుంటూరులో పడిపోయిన చికెన్ ధరలు

బర్డ్ ఫ్లూ ప్రభావంతో గుంటూరు నగరంలో కూడా చికెన్ రేట్లు తగ్గుముఖం పట్టాయి. గత వారం రోజుల క్రితం ఇతర జిల్లాలతో పోల్చుకుంటే గుంటూరు నగరంలో రూ.25 ఎక్కువగా విక్రయించారు. అయితే ఇప్పుడు పరిస్థితి మారింది. ప్రజలు మటన్, చేపల కొనుగోళ్లకు మొగ్గు చూపుతుండటంతో చికెన్ విక్రయాలు గణనీయంగా పడిపోయాయి. దీంతో గుంటూరు చికెన్ వ్యాపార దుకాణాల సంఘ సభ్యులు కేజీ రూ. 100కి విక్రయించాలని నిర్ణయించారు.
News February 18, 2025
గుంటూరు: పరీక్షల టైం టేబుల్ విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ మొదటి సెమిస్టర్ విద్యార్థులకు మార్చి 6 నుంచి 12 వరకు పరీక్షలు జరగనున్నట్లు వర్సిటీ పరీక్షల నిర్వహణ నియంత్రణ అధికారి ఆలపాటి శివ ప్రసాదరావు పేర్కొన్నారు. సోమవారం టైం టేబుల్ ఆయన విడుదల చేశారు. రెగ్యులర్, సప్లిమెంటరీ, స్పెషల్ ఏడ్యుకేషన్ విద్యార్థులకు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకూ 1,2,3 పేపర్లకు 2 నుంచి 3:30 వరకు 4,5,6 పేపర్లకు పరీక్షలు ఉంటాయన్నారు.