News February 14, 2025

పులివెందుల : శ్రీ వెంకటరమణుడికి స్నపన తిరుమంజన సేవ

image

శ్రీ వెంకటరమణుడి బ్రహ్మోత్సవాలలో భాగంగా పులివెందుల పట్టణంలోని శ్రీ పద్మావతి సమేత కళ్యాణ వెంకటరమణస్వామి ఆలయంలో గురువారం సాయంత్రం స్వామివారికి స్నపన తిరు మంజనసేవ నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే స్వామివారికి చక్రస్నానం చేయించారు. కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు వరదాచార్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Similar News

News February 19, 2025

గండికోటలో సెల్ఫీ తీసుకున్న అజయ్ జైన్, కలెక్టర్, MLA

image

గండికోటను ప్రపంచ స్థాయిలో ప్రఖ్యాత పర్యాటక కేంద్రంగా ప్రాచుర్యంలోకి తీసుకురావడానికి ఇక్కడ వనరులు పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర పర్యాటక శాఖ ప్రత్యేక కార్యదర్శి అజయ్ జైన్ అన్నారు. ఇక్కడి ప్రకృతి ఆస్వాదించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డితో గండికోట లోయ అందాల వద్ద సెల్ఫీ దిగారు.

News February 19, 2025

కడప: ‘ప్రాజెక్టులను విస్మరిస్తే ఉద్యమమే’

image

నీటిపారుదల ప్రాజెక్టులకు నిధుల కేటాయింపులో రాయలసీమను విస్మరిస్తే ఉద్యమం తప్పదని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే కెఆర్‌ఎంబి కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వరయ్య అన్నారు. ఫిబ్రవరి 22 నుంచి 24 వరకు కడపలో జరుగు ప్రాజెక్టుల ప్రాంతీయ సదస్సు ఉద్యమ కార్యాచరణకు వేదిక కానుందని తెలిపారు. కడపలో జరుగు ప్రాజెక్టుల ప్రాంతీయ మహాసభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.

News February 18, 2025

కడప: YVU వీసీగా ప్రకాశ్ బాబు

image

యోగి వేమన యూనివర్సిటీ నూతన ఉపకులపతిగా ప్రకాశ్ బాబును ఉన్నతాధికారులు నియమించారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడ్డాక ఇన్‌ఛార్జ్ వైస్ చాన్సలర్లతో పరిపాలన కొనసాగిస్తున్నారు. యోగివేమన యూనివర్సిటీ నూతన వీసీగా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సీనియర్ ప్రొఫెసర్ ప్రకాశ్ బాబును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈయన మూడేళ్ల పాటు ఇక్కడ వీసీగా కొనసాగనున్నారు.

error: Content is protected !!