News February 14, 2025
ఒంగోలు: వీడియో కాన్ఫరెన్స్‌లో మాగుంట

ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి ఇటీవల బైపాస్ సర్జరీ చేయించుకున్న తర్వాత మొదటిసారి ముఖ్య నాయకులు, అభిమానులతో మాగుంట కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వారితో మాట్లాడారు. వారంతా ఎంపీ యోగక్షేమాలు అడిగి తెలుసుకుని త్వరగా సంపూర్ణ ఆరోగ్యంతో ఒంగోలుకు రావాలని కోరారు. కార్యక్రమంలో ఘన శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 19, 2025
ఒంగోలు: రెవెన్యూ సదస్సుల అర్జీలపై నిర్లక్ష్యం వద్దు

రెవెన్యూ సదస్సులో వచ్చిన అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించకూడదని తహశీల్దార్లకు జాయింట్ కలెక్టర్ గోపాలకృష్ణ సూచించారు. మంగళవారం ఒంగోలు ఆర్డీవో కార్యాలయంలో ఒంగోలు, కొత్తపట్నం, చీమకుర్తి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు మండల తహశీల్దార్లతో జేసీ ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రెవిన్యూ సదస్సులు నిర్వహించినందున, వచ్చిన అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని JC ఆదేశించారు.
News February 18, 2025
ప్రకాశం జిల్లా TODAY TOP NEWS

*మద్దిపాడులో పర్యటించిన సినీనటి గౌతమి
*ప్రకాశం జిల్లా ప్రజలను వణికిస్తున్న GBS వైరస్
*యర్రగొండపాలె తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు
*పల్నాడులో దోర్నాల మహిళ మృతి
*కంభం: పెళ్లై 3రోజులే… అంతలోనే వధువు సూసైడ్
*రాచర్లలో అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు*
*నల్లమల అడవుల్లో ఉచ్చులు పెడితే.. ఏడేళ్ళ జైలు శిక్ష
News February 18, 2025
యర్రగొండపాలెం తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు

యర్రగొండపాలెం తహశీల్దార్‌పై సస్పెన్షన్ వేటు పడింది. రూ.5 కోట్ల విలువైన స్థలం విషయంలో అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలపై తహశీల్దార్ బాల కిషోర్‌ను జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో భాగస్వాములైన వీఆర్వో యల్లయ్య, సర్వేయర్ దిలీప్‌లను కూడా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారని యర్రగొండపాలెం ఇన్‌ఛార్జ్ తహశీల్దార్ నలగాటి మల్లికార్జున మంగళవారం తెలిపారు.