News February 14, 2025
సిరిసిల్ల: నిర్వహణ పారదర్శకంగా నిర్వర్తించాలి: శేషాద్రి

ఎన్నికల నిర్వహణ బాధ్యతలు పారదర్శకంగా నిర్వర్తించాలని డీపీవో, నోడల్ అధికారి శేషాద్రి అన్నారు. సిరిసిల్ల పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో రిటర్నింగ్, సహాయ రిటర్నింగ్ అధికారులకు గురువారం శిక్షణ ఇచ్చారు. ఎన్నికల నియమ నిబంధనల గురించి స్పష్టమైన అవగాహన ఉన్నప్పుడే పొరపాట్లకు ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం అందించిన హ్యాండ్ బుక్కులు చదువుకొని సజావుగా ఎన్నికల జరిగేలా కృషి చేయాలని పేర్కొన్నారు.
Similar News
News February 24, 2026
MLG: ఇంటర్ విద్యార్థులూ.. ఇవి తప్పక తెలుసుకోండి..!

రేపటి నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ పరీక్షల్లో తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని జిల్లా అధికారి వీరేందర్ తెలిపారు. ఎలక్ట్రానిక్ వస్తువులు, డిజిటల్ వాచ్, సెల్‌ఫోన్లు, కెమెరాలు ఎగ్జామ్ సెంటర్‌కు తీసుకురావద్దన్నారు. కాగా పరీక్షా కేంద్రానికి సుమారు 200 మీటర్ల వరకు ఎలాంటి జిరాక్స్ షాపులు కూడా తెరిచి ఉంచవద్దన్నారు. కేంద్రం వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని, పోలీసులు బందోబస్తు నిర్వహిస్తారని చెప్పారు.
News February 24, 2026
క్వింటా రూ.5,875: కార్యదర్శి జయలక్ష్మి

కర్నూలు వ్యవసాయ మార్కెట్ కమిటీలో నాఫెడ్ ఆధ్వర్యంలో శనగల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించినట్లు కార్యదర్శి ఆర్.జయలక్ష్మి తెలిపారు. జిల్లా కోఆపరేటివ్ మార్కెటింగ్ సొసైటీ నుంచి క్వింటాలుకు రూ.5,875 మద్దతు ధరతో శనగలు కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. రైతులు ఈ-క్రాప్ నమోదు సర్టిఫికెట్, తేమ శాతం పరీక్ష కోసం నమూనా తీసుకురావాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News February 24, 2026
TPT: మోహన్ బాబు కాలేజీ అమ్మాయి సూసైడ్

తిరుపతిలో మరొక కాలేజీ యువతి చనిపోయింది. మంగళం ఏరియాకు చెందిన యువతి(22) మోహన్ బాబు యూనివర్సిటీలో బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతోంది. కాలేజీ బయటే ఓ ప్రైవేట్ హాస్టల్లో ఉంటోంది. ఏమైందో ఏమో హాస్టల్లోనే ఉరివేసుకుంది. వెంటనే ఆమెను నారావారిపల్లి ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతిచెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది. జ్వరంతో నారాయణ కాలేజీ విద్యార్థిని <<19223316>>చనిపోయిన <<>>విషయం తెలిసిందే.


