News February 14, 2025
రెసిప్రోకల్ సుంకాలను వసూలు చేస్తాం: ట్రంప్

ఇతర దేశాల నుంచి రెసిప్రోకల్ (పరస్పర) సుంకాలను వసూలు చేయాలని నిర్ణయించినట్లు యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. US నుంచి ఆయా దేశాలు ఎంత వసూలు చేస్తే తామూ అంతే వసూలు చేస్తామని వెల్లడించారు. ఇతర దేశాలతో పోలిస్తే భారత్ ఎక్కువ టారిఫ్స్ వసూలు చేస్తోందని తెలిపారు. తాము కూడా భారత్ నుంచి అంతే వసూలు చేస్తున్నామని చెప్పారు.
Similar News
News February 19, 2025
నేడు బీఆర్ఎస్ భవన్‌కు కేసీఆర్

TG: గులాబీ బాస్ కేసీఆర్ నెలల విరామం తరువాత బీఆర్ఎస్ భవన్‌కు రానున్నారు. ఇవాళ మ.2 గంటలకు జరిగే పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొంటారు. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడంపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ నేతలు, ఇతర నాయకులకు దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ఏర్పడి 25 ఏళ్లు కావొస్తున్న నేపథ్యంలో సిల్వర్ జూబ్లీ వేడుకలు నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
News February 19, 2025
టీమ్ ఇండియా ఆ పాక్ ఆటగాడితో జాగ్రత్తగా ఉండాలి: హర్భజన్

పాక్ ఆటగాడు ఫకర్ జమాన్‌తో టీమ్ ఇండియా జాగ్రత్తగా ఉండాలని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ హెచ్చరించారు. ‘భారత్‌పై జమాన్ రికార్డు చాలా బాగుంది. గతంలో మన విజయావకాశాల్ని అతడు దెబ్బకొట్టాడు’ అని గుర్తుచేశారు. భారత్‌పై 6 మ్యాచులాడిన జమాన్ 46.80 సగటుతో 234 రన్స్ చేయడం గమనార్హం. ఛాంపియన్స్ ట్రోఫీలో దాయాదుల సమరం ఈ నెల 23న జరగనుంది.
News February 19, 2025
కులంలోనే కాదు.. మతంలోనూ పేదరికం ఉంది: షబ్బీర్ అలీ

TG: మైనారిటీలను BCల్లో కలిపారంటూ BJP చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని కాంగ్రెస్ ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ స్పష్టం చేశారు. ‘వెనుకబడిన మైనార్టీలు ఇప్పటికీ BC జాబితాలో ఉన్నారు. కులంలోనే కాదు మతంలోనూ పేదరికం ఉంది. పిలిస్తే బీజేపీ ఆఫీస్‌కు వచ్చి ప్రజెంటేషన్ ఇస్తా. వెనుకబడిన తరగతులు ఎక్కడ ఉన్నా వెనుకబడిన తరగతులే. బీసీలపై BJPకి అంత ప్రేమ ఉంటే బీసీ కులగణన చేయించాలి’ అని డిమాండ్ చేశారు.