News February 14, 2025
MNCL: బురద గుంటలో పడి వ్యక్తి మృతి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్‌లో గురువారం బురద గుంటలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని సీఐ ప్రమోద్ రావు తెలిపారు. మృతుని వయస్సు 60 ఏళ్లు ఉంటుందన్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712656534 నంబర్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
Similar News
News February 21, 2025
వీలైనంత త్వరగా చిత్తడి నేలలను గుర్తించండి: కలెక్టర్

వీలైనంత త్వరగా చిత్తడి నేలలను గుర్తించాలని కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం అనంతపురం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాస్థాయి చిత్తడి నేలల పరిరక్షణ సమావేశాన్ని నిర్వహించారు. ఫేస్-1, 2, 3లో జిల్లాలో గుర్తించదగిన చిత్తడి నేలల కోసం నోటిఫికేషన్ ప్రతిపాదనల తయారీ, సమర్పణ చేయాలన్నారు.
News February 21, 2025
శ్రీశైలంలో అలరిస్తున్న సాంస్కృతిక కార్యక్రమాలు

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా దేవస్థానం పలు సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేసింది. దేవస్థానం ఈ సాంస్కృతిక కార్యక్రమాలను ఆలయ దక్షిణ మాఢవీధిలోని నిత్యాకళారాధన వేదిక, పుష్కరిణి ప్రాంగణంలోని బ్రామరీకళావేదిక, శివదీక్షాశిబిరాల ప్రాంగ ణంలో నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా కూచిపూడి నృత్యప్రదర్శన, భరతనాట్యం, మహాశివరాత్రి వైభవం ప్రవచనం, వేణుగానం తదితర కార్యక్రమాలు భక్తులను అలరిస్తున్నాయి.
News February 21, 2025
ప్రతి కార్మికుడు ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసేలా చర్యలు తీసుకోండి: కలెక్టర్

ఈ-శ్రమ్ కార్డు ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రత లభిస్తుందని, జిల్లాలో ఉన్న అసంఘటిత రంగ కార్మికులను ఈ-శ్రమ్ పోర్టల్లో నమోదు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం ఈ-శ్రమ్ రిజిస్ట్రేషన్ అంశంపై కార్మిక శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పరిశ్రమల శాఖ, మత్స్య శాఖతో పాటు ఇతర శాఖలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు.