News February 14, 2025

నర్సాపూర్ (జి): వ్యక్తిపై హత్య ప్రయత్నం కేసు నమోదు: SI

image

పాత కక్షలతో ఓ వివాహితను హత్య చేయడానికి ప్రయత్నించిన ఘటన గురువారం నర్సాపూర్(జి) మండల కేంద్రంలో జరిగింది. స్థానిక ఎస్సై సాయి కిరణ్ వివరాల మేరకు.. గ్రామానికి చెందిన గడ్డం ఎల్లన్న పాత కక్షలు మనసులో పెట్టుకుని అదే గ్రామానికి చెందిన ఓ వివాహితను ఇంట్లో ఎవరూ లేని సమయంలో కత్తితో పొడిచాడు. వివాహిత భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు.

Similar News

News February 21, 2025

మహమ్మద్ షమీ ‘ది వారియర్’

image

మహమ్మద్ షమీ ఓటమిని ఒప్పుకోరు. గతేడాది కాలికి ఆపరేషన్ జరిగి నడవలేని స్థితి నుంచి CT తొలి మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన వరకు తన కృషి పోరాట యోధుడికి ఏ మాత్రం తీసిపోదు. గాయంతో ఏడాదికి పైగా జట్టుకు దూరమైనా, BGTకి సెలక్ట్ కాకపోయినా, ఇంగ్లండ్ సిరీస్‌లో రాణించకపోయినా పట్టుదల వదల్లేదు. ఏడాదిలోనే కమ్ బ్యాక్ చేసి బంగ్లాపై 5 వికెట్లు తీశారు. స్లో పిచ్‌పై రాకెట్ల లాంటి బంతులతో బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించారు.

News February 21, 2025

KPHBలో యువకుడి మిస్సింగ్

image

ఇ‌న్‌స్టాలో పరిచయమైన మహిళతో యువకుడు వెళ్లి పోయిన ఘటన KPHB PS పరిధిలో జరిగింది. బాధితుల వివరాల ప్రకారం.. పవన్ అనే యువకుడు ఈనెల 6వ తేదీన ఇంట్లో చెప్పకుండా వెళ్లిపోయాడు. 2 రోజుల క్రితం తాను ఫోన్ చేసి అనారోగ్యంగా ఉందని పుణేలో తెలియని ప్రాంతంలో ఉన్నానని ఫోన్ స్విచ్డ్ ఆఫ్ చేశాడు. కుటుంబ సభ్యులు కాల్ చేయగా మహిళా ఫోన్ ఎత్తి ‘మీ కుమారుడికి కాల్ చేస్తే చంపేస్తా’అని బెదిరించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

News February 21, 2025

జగిత్యాల జిల్లాలో నేటి TOP NEWS

image

@ జిల్లా వ్యాప్తంగా MLC ఎన్నికల ప్రచారం @ మేడిపల్లి, కోరుట్లలో పర్యటించిన కలెక్టర్ @అదనపు కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్కిల్ కమిటీ సమావేశం @ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఆదాయం వివరాలు @ ధర్మపురిలో పర్యటించిన ప్రభుత్వ విప్ అడ్లూరి @ కొడిమ్యాల: క్రీడలలో విద్యార్థినుల ప్రతిభ.. ఎస్పీ ప్రశంసా @ చెగ్యంలో ఘనంగా ముగిసిన మల్లన్న బోనాలు @ వెల్గటూరు ZPHSలో తరగతి గదిని పరిశీలించిన DEO రాము.

error: Content is protected !!