News February 14, 2025
బాసర అమ్మవారి ఆలయం ఆదాయం రూ.1,08,25,110

బాసర సరస్వతి అమ్మవారి హుండీకానుకలను ఆలయ అధికారులు గురువారం లెక్కింపు చేపట్టారు. రూ.1,08,25,110 నగదు, మిశ్రమ బంగారం 78 గ్రాములు, మిశ్రమ వెండి 4.800 కిలోలతో వివిధ దేశాలకు చెందిన కరెన్సీలు 36 నోట్లు వచ్చినట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఈ ఆదాయం మొత్తం దేవస్థానానికి 79 రోజుల్లో సమకూరినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Similar News
News February 21, 2025
ఫిబ్రవరి 21: చరిత్రలో ఈరోజు

1894: శాస్త్రవేత్త శాంతి స్వరూప్ భట్నాగర్ జననం (ఫొటోలో)
1941: ఇన్సులిన్ సహ ఆవిష్కర్త ఫ్రెడరిక్ బాంటింగ్ మరణం
1976: సినీ గాయకుడు విజయ ప్రకాశ్ జననం
1977: సినీ గాయకుడు రంజిత్ జననం
1988: నటి వేదిక జననం
2013: దిల్‌సుఖ్ నగర్‌లో బాంబు పేలుళ్లు.. 18 మంది మృతి
* అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం
News February 21, 2025
సంగారెడ్డి: పాఠశాలల HMలకు విద్యాధికారి సూచనలు

జిల్లాలోని 44 పాఠశాలకు పీఎంశ్రీ కింద విడుదలైన నిధులను పూర్తిగా వినియోగించుకోవాలని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం ఓ ప్రకటనలో కోరారు. ఆయన మాట్లాడుతూ.. నిబంధనల ప్రకారం నిధులను పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ఖర్చు చేయాలని పేర్కొన్నారు. నిధులు ఖర్చు చేసిన తర్వాత సంబంధిత యూసీలను సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని ఆదేశించారు.
News February 21, 2025
ఈరోజు నమాజ్ వేళలు

తేది: ఫిబ్రవరి 21, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 5.27 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6.39 గంటలకు
దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు
అసర్: సాయంత్రం 4.43 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6.20 గంటలకు
ఇష: రాత్రి 7.33 గంటలకు
NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.