News February 14, 2025

ఖమ్మం ప్రధాన రహదారులు.. రక్తసిక్తం

image

ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మినీ మేడారం జాతర, పలు మండలాల్లో ఆలయాల మహోత్సవాలతో గురువారం ఖమ్మం జిల్లాలో జనాల తాకిడి పెరిగింది. దీంతో పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగాయి. దాదాపు పదుల సంఖ్యలో దుర్మరణం చెందారు. అలాగే పలువురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అకాల ప్రమాదాలతో కుటుంబాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి.

Similar News

News March 12, 2025

తెలంగాణ బడ్జెట్.. ఖమ్మం జిల్లాకి ఏం కావాలంటే..?

image

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలో పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.ఖమ్మం మున్నేరు పై తీగల వంతెన నిర్మాణం, పాలేరు నియోజకవర్గంలో ఇంజనీరింగ్ కాలేజీ, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిధులు, సీతారామ ప్రాజెక్ట్, రోడ్ల మరమ్మత్తులకు నిధులు కేటాయించాలంటున్నారు.

News March 12, 2025

ఖమ్మం: పట్టుపట్టాడు.. కొలువులు సాధిస్తున్నాడు..

image

పట్టుదలతో ప్రభుత్వ కొలువులు సాధించుకుంటూ వస్తూ యువతకు ఆదర్శంగా నిలిచాడు. తాజాగా గ్రూప్- 2లో 387 మార్కులతో స్టేట్ 148 ర్యాంక్, జోన్‌లో 20వ ర్యాంక్ సాధించాడు. అతడే తల్లాడ మండలం మల్లవరంకు చెందిన దుగ్గిదేవర వెంకటేశ్వరరావు. తొలి ప్రయత్నంలోనే 2018లో పంచాయితీ కార్యదర్శిగా, 2019లో FBOగా, 2020లో విద్యుత్ శాఖలో జూనియర్ ఎకౌంట్స్ ఆఫీసర్ కొలువులను వరుసగా సాధిస్తూ వచ్చాడు.

News March 12, 2025

ఖమ్మం: నిరుద్యోగులకు డిప్యూటీ సీఎం భట్టి GOOD NEWS

image

తెలంగాణ నిరుద్యోగ యువత ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం పథకం ప్రవేశపెడుతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ పథకం కింద సంక్షేమశాఖ, SC, ST, BC, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా నిరుద్యోగ యువతకు రూ.3 లక్షల నుంచి రూ.5 లక్షల వరకు సాయం చేస్తామని తెలిపారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఈ పథకం కోసం దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రూ.6వేల కోట్లతో ఈ పథకం రూపొందించామని డిప్యూటీ సీఎం చెప్పారు.

error: Content is protected !!