News February 14, 2025

తిరుపతి: రైలు ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

image

రైలు ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ సమీపంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. గుర్తు తెలియని వ్యక్తి పట్టాలు దాటుతుండగా నెల్లూరు నుంచి చెన్నై వైపు వెళ్తున్న గూడ్స్ రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని సూళ్లూరుపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Similar News

News March 20, 2025

అనంత: రెవెన్యూ సెక్టార్‌పై వీడియో కాన్ఫరెన్స్

image

అనంతపురం కలెక్టరేట్‌లోని మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి రెవెన్యూ సెక్టార్‌పై డీఆర్ఓ, ఆర్డీఓలు, జిల్లా రిజిస్టర్, తహశీల్దార్లు, మండల సర్వేయర్లు, ఆర్ఎస్డీటీలు, ఎస్ఆర్ఓలు తదితరులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ బుధవారం సాయంత్రం సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సెక్టర్‌లో అవకతవకలు జరిగితే ఏ ఒక్క అధికారిని ఉపేక్షించే పరిస్థితి ఉండదని జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.

News March 20, 2025

KNR: విద్యార్థి దశలో అవకాశాలను అందిపుచ్చుకోవాలి: కలెక్టర్

image

నెహ్రూ యువజన కేంద్రం ఆధ్వర్యంలో కరీంనగర్ జిల్లాస్థాయి యువజన ఉత్సవం కార్యక్రమం తిమ్మాపూర్‌లోని ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కలెక్టర్ పమేలా సత్పతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. విద్యార్థి దశలో స్వేచ్ఛ, అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు. ఈ దశలోనే చదువుతోపాటు సమాజసేవను అలవర్చుకోవాలన్నారు. విద్యార్థులు వాలంటీర్లుగా సేవలు అందించడం కూడా ముఖ్యమైన్నారు.

News March 20, 2025

ఉద్యోగుల రిటైర్మెంట్ ఏజ్ పెంచడం లేదు: కేంద్ర మంత్రి

image

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సులో ఎటువంటి మార్పులు చేయట్లేదని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ అన్నారు. కొన్ని రంగాల్లో రిటైర్మెంట్ వయస్సు 60 సంవత్సరాలుంటే మరికొన్నిచోట్ల 65గా ఉందని తెలిపారు. రాష్ట్ర ఉద్యోగుల పదవీ విరమణ అనేది స్టేట్స్‌కు సంబంధించిందని అన్నారు. అయితే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగుల రిటైర్మెంట్ వయస్సు 58 సంవత్సరాలు ఉండగా గత ప్రభుత్వం 61 ఏళ్లకు పెంచింది.

error: Content is protected !!