News February 14, 2025

విజయవాడ: పోలీసులు కీలక ప్రకటన

image

ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ రాజశేఖర్ గురువారం కీలక ప్రకటన చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు, పబ్లిక్ పరీక్షల దృష్ట్యా నేటి నుంచి ఏప్రిల్ 3వరకు సెక్షన్ 163 కింద ఆంక్షలు విధిస్తున్నట్లు సీపీ స్పష్టం చేశారు. నగర పరిధిలో ఎక్కవ మంది గుమికూడవద్దన్నారు. కర్రలు, రాళ్లు, మారణాయుధాలు పట్టుకొని తిరగొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News November 9, 2025

జాతీయస్థాయి స్విమ్మింగ్‌కు హర్షవర్ధన్ రాజు ఎంపిక

image

విశాఖపట్నంలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-19 స్కూల్ గేమ్స్ స్విమ్మింగ్ పోటీల్లో సత్తెనపల్లి ప్రగతి కళాశాల విద్యార్థి బి. హర్షవర్ధన్ రాజు స్వర్ణం, కాంస్యం పతకాలు సాధించాడు. ఈ ప్రతిభతో నవంబర్ 29 నుంచి డిసెంబర్ 5 వరకు ఢిల్లీలో జరగనున్న 69వ నేషనల్ గేమ్స్‌కు అతడు ఎంపికయ్యాడు. విజయం సాధించిన హర్షవర్ధన్‌ రాజును కళాశాల యాజమాన్యం అభినందించింది.

News November 9, 2025

టీ20 WC వేదికలు ఖరారు?

image

ICC మెన్స్ T20 వరల్డ్ కప్-2026 వేదికలు ఖరారైనట్లు తెలుస్తోంది. ముంబై, ఢిల్లీ, చెన్నై, అహ్మదాబాద్, కోల్‌కతాతో పాటు శ్రీలంకలోని కొలంబో, కాండీలో మ్యాచులు జరగనున్నట్లు Cricbuzz పేర్కొంది. అహ్మదాబాద్, కోల్‌కతాలో సెమీ ఫైనల్స్ జరుగుతాయని, ఫైనల్ ఎక్కడ నిర్వహించాలనే దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. SL లేదా PAK ఫైనల్ చేరితే కొలంబోలో ఫైనల్ జరిగే అవకాశముంది. FEB 7న టోర్నీ ప్రారంభమయ్యే ఛాన్సుంది.

News November 9, 2025

రోడ్డు పక్కనే పెద్ద ఇళ్లు కట్టుకోవచ్చా?

image

రోడ్డు పక్కన ఇంటి నిర్మాణాలు ఎలా ఉండాలో వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచించారు. ‘రోడ్డు పక్కనే పెద్ద ఇళ్లు కట్టుకోవాలంటే స్థానిక సంస్థల అనుమతి ఉండాలి. రోడ్డు వెడల్పును బట్టి ఎత్తు పరిమితిని నిర్ణయిస్తారు. వాస్తు శాస్త్రం కూడా దీనిని నిర్ధారిస్తుంది. అయితే ఇంటికి రోడ్డుకు మధ్య తగినంత ఖాళీ స్థలం ఉండాలి. గాలి, వెలుతురు ఇంట్లోకి రావడానికి ఈ నియమాలను పాటించడం తప్పనిసరి’ అని ఆయన చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>