News February 14, 2025

తుని: దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్‌కి పితృవియోగం

image

ప్రముఖ సినీ దర్శకుడు ఏలేటి చంద్రశేఖర్ తండ్రి ఏలేటి సుబ్బారావు (73) అనారోగ్యంతో మృతి చెందారు. కాకినాడ జిల్లా తుని మండలం రేఖవానిపాలెం గ్రామంలో గురువారం సాయంత్రం కుటుంబ సభ్యులు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. సంగీత దర్శకుడు, మృతుని బంధువులైన ఎంఎం కీరవాణి, రాజమౌళి సతీమణి తదితరులు గ్రామానికి వచ్చి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Similar News

News September 17, 2025

వరంగల్: ఐక్యతతోనే విజయం సాధ్యం

image

ఐక్యతతోనే విజయం సాధ్యం అనే నానుడిని స్ఫూర్తిగా తీసుకుంటూ తెలంగాణ గడ్డ ఎల్లప్పుడూ పోరాటపటిమను ప్రదర్శిస్తోందని వరంగల్ పోలీసులు పేర్కొన్నారు. ఐక్యతతో ముందుకు సాగితేనే సమాజం అభివృద్ధి దిశగా దూసుకుపోతుందన్న సందేశాన్ని కొనసాగిస్తూ విజయపథంలో ముందుకు సాగుదాం అంటూ తమ అధికారిక X ఖాతా ద్వారా పిలుపునిచ్చారు.

News September 17, 2025

మోదీ బయోపిక్.. పోస్టర్ రిలీజ్

image

ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ రూపొందుతోంది. దీనికి ‘మా వందే’ టైటిల్‌ను ఖరారు చేస్తూ మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ సినిమాను క్రాంతి కుమార్‌ సీహెచ్ తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో ఉన్ని ముకుందన్ లీడ్ రోల్‌లో కనిపిస్తారు. పోస్టర్‌పై మోదీ సంతకం చేస్తున్నట్లు ఉన్న ఫొటో ఉండగా.. ‘ఎన్నో పోరాటాల కన్నా, తల్లి సంకల్ప బలం గొప్పది’ అని మోదీ చెప్పిన మాటలను ముద్రించారు.

News September 17, 2025

తిరుమల బ్రహ్మోత్సవాలకు రావాలని ఆహ్వానం

image

సీఎం చంద్రబాబును ఆయన క్యాంపు కార్యాలయంలో TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు బుధవారం కలిశారు. తిరుమల వార్షిక బ్రహ్మోత్సవాలకు రావాలని సీఎంకు ఆహ్వాన పత్రికను అందజేశారు. టీటీడీ వేద పండితులు సీఎం చంద్రబాబును ఆశీర్వదించారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను ఆయనకు టీటీడీ ఛైర్మన్ వివరించారు.