News March 20, 2024

విజయవాడ: పవర్ లిఫ్టింగ్‌లో శ్రీదేవికి కాంస్య పతకం

image

న్యూ ఢిల్లీలో జరుగుతున్న ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ పవర్ లిఫ్టింగ్ టోర్నమెంట్‌లో ఎన్.శ్రీదేవి కాంస్య పతకం సాధించింది. శ్రీదేవి విజయవాడలోని కేసరపల్లి జిల్లా పరిషత్ హైస్కూల్‌లో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ ఎడ్యుకేషన్‌ టీచర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా శ్రీదేవిని పలువురు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్, సహచర అధ్యాపకులు అభినందించారు.

Similar News

News April 11, 2025

MTM: పోలీసు అధికారులు, సిబ్బందికి రివార్డులు 

image

మచిలీపట్నంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో మార్చి నెల జరిగిన క్రైమ్ డిటెక్షన్‌లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఎస్పీ గంగాధరరావు రివార్డులు అందజేశారు. కంకిపాడు సీఐ మురళీకృష్ణ, ఎస్ఐ సందీప్, హెడ్ కానిస్టేబుల్ చంద్ర, కానిస్టేబుల్స్ బాజీ, మూర్తిలను ప్రత్యేకంగా అభినందించి రివార్డులు అందించారు. 

News April 11, 2025

సమస్యలు తలెత్తకుండా రీ సర్వే: కలెక్టర్ బాలాజీ

image

ఎలాంటి సమస్యలు తలెత్తకుండా రీసర్వే ప్రక్రియను సజావుగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. పెదపారుపూడి మండలం పాములపాడులోని గ్రామ రెవెన్యూ అధికారి కార్యాలయం భవనంలో రి సర్వేకు సంబంధించిన రికార్డులను ఆకస్మికంగా గురువారం తనిఖీ చేశారు. గ్రామ పరిధిలో ఇప్పటివరకు పూర్తి చేసిన రిసర్వే ప్రక్రియ తలెత్తిన సమస్యలపై కలెక్టర్ బాలాజీ ఆరాతీశారు.

News April 10, 2025

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

☞ కృష్ణా జిల్లాలో నియోజకవర్గానికి ఒక MSME పార్క్ ఏర్పాటు: కలెక్టర్
☞ కేసరపల్లి: చెరువులో పడి మహిళ మృతి
☞12 నుంచి తేలప్రోలు రంగమ్మ పేరంటాలమ్మ తిరునాళ్లు
☞గుడివాడలో ఆర్టీసీ కార్మికుల ధర్నా
☞ఇంతేరు సర్పంచి వైఖరిపై గ్రామస్థులు ఆగ్రహం
☞ పెనమలూరులో ముస్లింల నిరసన ర్యాలీ
☞ నాగాయలంకలో ఫుడ్ సేఫ్టీ అధికారి పేరుతో బెదిరింపులు.

error: Content is protected !!