News February 14, 2025
వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా చిట్లూరు రమేశ్ గౌడ్

వైసీపీ రాష్ట్ర కార్యదర్శిగా అనంతపురానికి చెందిన చిట్లూరు రమేశ్ గౌడ్ నియమితులయ్యారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి గురువారం సాయంత్రం ఉత్తర్వులు జారీ అయ్యాయి. రమేశ్ గౌడ్ మాట్లాడుతూ.. వైసీపీలో తనకు రాష్ట్రస్థాయి పదవిని కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్‌కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం కృషి చేస్తానని పేర్కొన్నారు.
Similar News
News July 5, 2025
HYD: GHMC వెబ్‌సైట్‌లో ఈ సదుపాయాలు

ఆస్తి పన్నుకు సంబంధించి ప్రజల సౌకర్యార్థం కొన్ని సదుపాయాలను GHMC వెబ్ సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి తెచ్చినట్లు అడిషనల్ కమిషనర్ అనురాగ్ జయంతి తెలిపారు. ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్ మెంట్, రివిజన్, వేకెన్సీ రెమిషన్, యజమాని పేరు కరెక్షన్, డోర్ నెంబర్ కరెక్టన్, అసెస్ మెంట్ మినహాయింపు, ప్రాపర్టీ టాక్స్ సెల్ఫ్ అసెస్మెంట్ ఉన్నాయన్నారు. ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవాలని కోరారు.
News July 5, 2025
బావాజీపాలెంలో యువకుడి మృతి

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన నిజాంపట్నం మండలం బావాజీపాలెంలో శనివారం చోటుచేసుకుంది. ఎస్ఐ తిరుపతిరావు వివరాల మేరకు.. ఆముదాలపల్లికి చెందిన మణికంఠ కృష్ణ కుమార్(24) తెనాలి నుంచి ఆముదాలపల్లికి బైక్‌పై వస్తున్నాడు. ఈ క్రమంలో బావాజీపాలెం దాటిన తర్వాత బైక్ అదుపుతప్పి తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.
News July 5, 2025
HYD: నిమజ్జనాల కోసం రెడీమేడ్ పాండ్స్ ఏర్పాటు

రాబోయే వినాయక చవితి సందర్భంగా చిన్న విగ్రహాల నిమజ్జనాల కోసం రెడీమేడ్ పాండ్స్ సరఫరా కోసం సంబంధిత ఏజెన్సీలను జీహెచ్ఎంసీ ఆహ్వానిస్తోంది. ప్రస్తుతానికి సికింద్రాబాద్ జోన్‌కు సంబంధించి 20 మీటర్ల పొడవు,10 మీటర్ల వెడల్పు, 1.32 మీటర్ల లోతుతో ఉండే పోర్టబుల్ పాండ్స్ తయారీ ఏర్పాటు చేసేందుకు నోటిఫికేషన్ వెలువరించారు. కాగా POPతో చేసిన విగ్రహాలను నగరంలో నిమజ్జనం చేయరాదని హైకోర్టు తెలిపిన విషయం తెలిసిందే.