News February 14, 2025
కడపలో దారుణం.. భార్యను కడతేర్చిన భర్త

కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో బెల్లం మండివీధిలో గురువారం అర్ధరాత్రి దారుణం చోటు చేసుకుంది. తన భార్య జమీల భాను(32) తలపై భర్త ఇమ్రాన్ సుత్తితో మోది దారుణంగా హత్య చేశాడు. వీరికి ముగ్గురు సంతానం. భార్యాభర్తల మధ్య మనస్పర్ధలే కారణమని.. ప్రాథమికంగా పోలీసుల విచారణలో తేలింది. ఘటనా స్థలంలో కడప టూ టౌన్ సీఐ బి. నాగార్జున, ఎస్సై ఎస్.కె.ఎం హుస్సేన్ తమ సిబ్బందితో కలిసి విచారిస్తున్నారు.
Similar News
News November 6, 2025
జమ్మలమడుగు: తండ్రి, కుమార్తెకు జైలుశిక్ష

జమ్మలమడుగులోని నాగులకట్ట వీధికి చెందిన గంజి మాధవి(32) బీసీ కాలనీకి చెందిన మునగాల రవి(35) దగ్గర రూ.5లక్షలు అప్పు తీసుకుంది. డబ్బులు తిరిగి ఇవ్వాలని రవి ఒత్తిడి చేయడంతో అతడిపై ఆమె కక్ష పెంచుకుంది. 2017 జనవరి 19న నాగులకట్ట వీధిలో తన తండ్రి సూర్యనారాయణ రెడ్డి(65)తో కలిసి రవిని ఇనుప రాడ్డుతో కొట్టి హత్య చేసింది. నేరం నిరూపణ కావడంతో మాధవి, సూర్యనారాయణకు కోర్టు తాజాగా జీవిత ఖైదు విధించింది.
News November 6, 2025
22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు: జేసీ

జిల్లాలో వరి రైతులకు కనీస మద్దతు ధర అందించేందుకు 22 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ తెలిపారు. సాధారణ రకం వరికి క్వింటాకు రూ. 2,369, ఏ-గ్రేడ్ రకానికి రూ. 2,389 ప్రభుత్వం చెల్లిస్తుందని స్పష్టం చేశారు. ఈ-క్రాప్, ఈ-కేవైసీతో పాటు తమ పేర్లను నమోదు చేసుకున్న రైతులు మాత్రమే కొనుగోలుకు అర్హులని ఆమె తెలిపారు.
News November 5, 2025
ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: ఎస్పీ

ప్రొద్దుటూరులో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న 6 మంది సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆన్లైన్ యాప్ల ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తూ, పదుల సంఖ్యలో ఫేక్ కరెంట్ బ్యాంక్ అకౌంట్లు తెరిచి ఆర్థిక నేరాలకు పాల్పడుతున్నట్టు ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. ఈ ముఠా నుంచి రూ.6.28 లక్షల నగదు, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.


