News February 14, 2025
తూ.గో: నామినేషన్లు విత్ డ్రా చేసుకుంది వీరే..

గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో 35 మంది నిలిచారు. మొత్తం 54 మంది నామినేషన్ వేయగా అధికారులు 11 మంది నామినేషన్లను తిరస్కరించారు. అందులో 8 మంది విత్ డ్రా చేసుకున్నారు. 35 మంది బరిలో నిలిచారు. పిల్లంగొళ్ల లీలా నగేశ్, విజయలక్ష్మీ, కవల నాగేశ్వరరావు, పచ్చిగోళ్ల దుర్గారావు, పేరాబత్తుల సత్యవాణి, గండుమోలు బాలాజీ, సత్తి రాజు స్వామి, కోండ్రు చక్రపాణి విత్ డ్రా చేసుకున్నారు.
Similar News
News November 11, 2025
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించాలి: మంత్రులు

ఖమ్మం జిల్లాలోని ధాన్యం, పత్తి కొనుగోలు కేంద్రాలలో రైతులకు సౌకర్యాలు కల్పించాలని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్ అనుదీప్‌కు కేంద్రాలను ప్రారంభించాలని ధాన్యం త్వరగా తరలించాలని సూచించారు. తార్పాలిన్లు, గన్నీ సంచులు, ప్యాడీ క్లీనర్లు సహా అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని మంత్రులు స్పష్టం చేశారు.
News November 11, 2025
అమరావతిలో MSK క్రికెట్ అకాడమీ

AP: అమరావతిలో ఇంటర్నేషనల్ క్రికెట్ అకాడమీకి BCCI మాజీ చీఫ్ సెలక్టర్ MSK ప్రసాద్ భూమిపూజ నిర్వహించారు. పిచుకలపాలెం రెవెన్యూ పరిధిలో 12 ఎకరాల్లో ఈ అకాడమీ నిర్మిస్తున్నారు. ఇందులో క్రికెట్ గ్రౌండ్, ఇండోర్, అవుట్ డోర్ ట్రైనింగ్ జోన్స్, 400 మంది ప్లేయర్ల సామర్థ్యంతో ట్రైనింగ్ సెంటర్, 1000 మంది ఉండేలా స్పోర్ట్స్ రెసిడెన్షియల్ స్కూల్, హాస్టల్స్, జిమ్, ఫిజియోథెరపీ వంటి సదుపాయాలు ఉండనున్నాయి.
News November 11, 2025
HYD: ఓటు వేసి ఈ పని చేయండి

ఓటు వేయడం మన బాధ్యత.. మనం ఓటేస్తే ఇంకొకరు పోలింగ్ బూత్‌కు వెళతారు.. అందుకే మీరు ఓటు వేసిన తరువాత బయటకు వచ్చి ‘నేను ఓటు వేశా.. మరి మీరు..? అని క్యాప్షన్ పెట్టి మీ ఇన్‌స్టా, ఫేస్‌బుక్, ఇతర సోషల్ మీడియాల్లో పోస్ట్ చేయండి. దానిని చూసిన మరికొందరికి మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని ఓటేస్తారు. ఇలా అందరూ చేస్తే పోలింగ్ శాతం పెరుగుతుంది..మంచి నాయకుడు గెలుస్తారు.


