News February 14, 2025
Valentine’s Day SPECIAL.. మన కొండా లవ్ స్టోరీ తెలుసా..?

ఉమ్మడి ఓరుగల్లు జిల్లాలో ది బెస్ట్ లవ్ కపుల్ ఎవరంటే కొండా మురళి, సురేఖ దంపతులని ఎవరిని అడిగినా చెప్పేస్తారు. 1980లో వరంగల్ LB కళాశాలలో చిగురించిన వీరి పరిచయం ప్రేమగా మారింది. ఆ ప్రేమ కాస్తా పెళ్లి వరకు వెళ్లింది. 1987లోనే సురేఖను తిరుపతి తీసుకెళ్లి మురళి పెళ్లి చేసుకున్నారట. వీరి ప్రేమపై ‘కొండా’ మూవీ సైతం వచ్చిన విషయం తెలిసిందే. మీకు తెలిసిన ఓ లవ్ స్టోరీని కామెంట్ చేయండి.
Similar News
News July 7, 2025
ఒంగోలు IIITలో 184 సీట్లు ఖాళీ

ఒంగోలు IIIT క్యాంపస్‌కు సంబంధించి మొదటి విడత సీట్ల భర్తీ పూర్తయ్యింది. మొత్తం 1,010 సీట్లు ఉండగా 826 సీట్లను భర్తీ చేశారు. ఇంకా 184 సీట్లు ఖాళీగా ఉన్నాయి. వీటిని త్వరలో భర్తీ చేయనున్నారు. మెరిట్ ఆధారంగా సీట్లు కేటాయించి ఈనెల 11, 12వ తేదీలో రెండో విడత ప్రవేశాల లిస్ట్ విడుదల చేస్తారు. ఈనెల 14న క్లాసులు ప్రారంభమవుతాయి.
News July 7, 2025
నేడు కరీంనగర్‌లో మంత్రుల పర్యటన

కరీంనగర్‌లో నేడు మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీహరి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనలు పర్యటించనున్నారు.
ఉ.9:30 గం.కు పాత ఆర్ట్స్ కళాశాల వద్ద నూతన పాఠశాల భవనాన్ని ప్రారంభిస్తారు.
10 గం.లకు అంబేడ్కర్ స్టేడియంలో వన మహోత్సవంలో పాల్గొంటారు.
11గం.కు చేప పిల్లల పెంపకం పరిశీలించి ముదిరాజ్ సంఘాలతో సమావేశమవుతారు.
11:30గంకు క్రీడా పాఠశాల, ఈతకొలను ప్రారంభించి వివిధ క్రీడా సంఘాలతో సమావేశమవుతారు.
News July 7, 2025
NZB: శాంతాబాయి కుటుంబానికి సాయం చేయాలని సీఎం ఆదేశం

వేల్పూర్ మండలం రామన్నపేటకు చెందిన <<16959274>>80 ఏళ్ల వృద్ధురాలు<<>> శాంతాబాయి, ఆమె ముగ్గురు కుమారులకు CM రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ నుంచి అవసరమైన తోడ్పాటును అందిస్తామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. పుట్టుకతోనే అంధులుగా జన్మించిన ముగ్గురు కుమారులకు సపర్యలు చేయడానికి వృద్ధురాలు పడుతున్న ఇబ్బందులపై పలు మీడియాల్లో కథనం ప్రచురించగా ప్రభుత్వం స్పందించింది.