News February 14, 2025
సిద్దిపేట: పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే ఘటనకు 11 ఏళ్లు

పొన్నం ప్రభాకర్‌పై పార్లమెంట్‌లో పెప్పర్ స్ప్రే దాడి జరిగి 11 ఏళ్లు పూర్తయింది. 2014 ఫిబ్రవరి 13న లోక్‌సభలో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టిన సమయంలో విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ చేసిన పెప్పర్ స్ప్రే దాడికి పొన్నం ప్రభాకర్ తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. TG రాష్ట్ర సాధన కోసం KNR MP హోదాలో ఆయన పోరాటం చేశారు. ప్రస్తుతం పొన్నం HSBD ఎమ్మెల్యేగా, రాష్ట్ర మంత్రిగా ఉన్నారు.
Similar News
News July 6, 2025
IIITలో 598 సీట్లు మిగిలాయి..!

IIIT సీట్ల భర్తీకి నిర్వహిస్తున్న కౌన్సెలింగ్ శనివారంతో ముగిసింది. నాలుగు క్యాంపస్‌ల్లో 598 సీట్లు మిగిలాయి. ఒక్కో IIITలో 1,010 సీట్లు ఉండగా.. ఇడుపులపాయలో 132 మిగలడం గమనార్హం. ఈ సీట్లను భర్తీ చేసేందుకు ఈనెల 14 నుంచి రెండో విడత కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. సీట్లు పొందిన వారికి ఈనెల 14 నుంచి తరగతుల ప్రారంభమవుతాయని రిజిస్ట్రార్ వెల్లడించారు.
News July 6, 2025
ఆమదాలవలస: పార్ట్ టైం పేరుతో వెట్టి చాకిరి తగదు

పార్ట్ టైం పేరుతో వీఆర్ఏలతో ప్రభుత్వం వెట్టి చాకిరి చేయించుకుంటుందని రాష్ట్ర వీఆర్ఏ సంఘం అధ్యక్షుడు షేక్ బందిగీకి సాహెబ్ అన్నార. వీఆర్ఏ సంఘం 7వ జిల్లా మహాసభ ఆదివారం ఆమదాలవలసలో జరిగింది. వీఆర్ఏలు ఫుల్ టైం విధులు నిర్వహిస్తున్నా ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం లేదని, కనీస వేతనాలు అమలు చేయడం లేదన్నారు. తెలంగాణ మాదిరిగా రాష్ట్రంలో వీఆర్ఏలకు పే స్కేల్ అమలు చేయాలని కోరారు.
News July 6, 2025
రోజుకు 9 గంటల నిద్ర.. రూ.9 లక్షలు గెలిచింది

ఎక్కువ సమయం నిద్రపోతే బద్దకం వస్తుందని ఇంట్లో వాళ్లు తిడుతుంటారు. కానీ పుణేకు చెందిన పూజా రోజుకు 9 గంటలు నిద్రిస్తూ రూ.9.1 లక్షలు గెలిచారు. ఓ పరుపుల కంపెనీ నిర్వహించిన పోటీలో పాల్గొని, 60 రోజులు సగటున 9 గంటల పాటు ఎలాంటి ఆటంకం లేకుండా నిద్రించారు. నిద్రలేమిపై అవగాహన కల్పించేందుకు నిర్వహించిన ఇంటర్న్‌షిప్‌లో లక్ష మందిలో 15 మంది తుదిపోరులో నిలిచారు. వీరిలో బెస్ట్ స్కోర్‌తో పూజా నగదు గెలిచారు.