News February 14, 2025

జేఈఈలో నేహలతకు 93.22 పర్సంటైల్

image

నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం రాజుపేటకు చెందిన బైరోజు బ్రహ్మచారి-కల్యాణి దంపతుల కుమార్తె నేహలత ఇటీవల విడుదలైన జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో 93.22 పర్సంటైల్ సాధించింది. నేహలత గౌలిదొడ్డిలొని సాంఘిక సంక్షేమ గురుకులంలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఎస్సీ డీడీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్, గురుకుల కార్యదర్శి వర్షిణి, ప్రిన్సిపల్ కల్పన అభినందించారు.

Similar News

News September 14, 2025

త్రుటిలో తప్పిన విమాన ప్రమాదం

image

లక్నో విమానాశ్రయంలో లక్నో- ఢిల్లీ ఇండిగో విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఎంపీ డింపుల్ యాదవ్‌తో పాటు 151 మంది ప్రయాణికులు ఉన్న విమానం టేకాఫ్ సమయంలో రన్‌వే మీద ఒక్కసారిగా స్లో అయింది. పైలట్ చాకచక్యంగా ఎమర్జెన్సీ బ్రేకులను ఉపయోగించి ఫ్లైట్‌ను రన్‌వే దాటకుండా ఆపారు. దీంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.

News September 14, 2025

శ్రీశైలం ప్రాజెక్ట్ తాజా సమాచారం

image

శ్రీశైలం జలాశయానికి వరద కొనసాగుతుండటంతో డ్యామ్ 7 గేట్లు ఎత్తి నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.
◆ ఇన్ ఫ్లో: 1,57,458 క్యూసెక్కులు
◆ అవుట్ ఫ్లో: 2,60,401 క్యూసెక్కులు (7 గేట్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా)
◆ ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం: 884.40 అడుగులు
◆ నీటి నిల్వ: 212.4385 టీఎంసీలు

News September 14, 2025

ప్రజారోగ్యం విషయంలో ప్రభుత్వం విఫలం: YCP

image

AP: విజయవాడ న్యూరాజరాజేశ్వరిపేటలోని డయేరియా బాధితులను YCP నిజనిర్ధారణ కమిటీ పరామర్శించింది. మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్, మొండితోక జగన్మోహన్ తదితరులు బాధితులతో మాట్లాడారు. ‘న్యూరాజరాజేశ్వరిపేటలో హెల్త్ ఎమర్జెన్సీ ప్రకటించాలి. డోర్‌2డోర్ సర్వే చేసి బాధితుల వివరాలు సేకరించాలి. డ్రైనేజీ, పారిశుద్ధ్య వ్యవస్థలను మెరుగుపరచాలి. మెడికల్ క్యాంపుల ద్వారా వారికి భరోసా ఇవ్వాలి’ అని వారు పేర్కొన్నారు.