News February 14, 2025

Stock Markets: భారీ లాభాల్లో మొదలవ్వొచ్చు..

image

దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు భారీగా లాభపడొచ్చు. గిఫ్ట్‌నిఫ్టీ 100pts లాభంతో మొదలవ్వడం దీనినే సూచిస్తోంది. అమెరికా, ఫ్రాన్స్‌తో కీలక ఒప్పందాలు కుదరడమూ పాజిటివ్ సెంటిమెంటును నింపింది. డాలర్ ఇండెక్స్ తగ్గడం శుభపరిణామం. ఆసియా మార్కెట్ల నుంచైతే మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. నిఫ్టీ రెసిస్టెన్సీ 23,250, సపోర్టు 22,900 వద్ద ఉన్నాయి. సూచీ 23,200 పై స్థాయిలో నిలదొక్కుకుంటేనే బలం పెరిగినట్టు లెక్క.

Similar News

News November 10, 2025

అలాంటి వారితో జాగ్రత్త.. మహిళా క్రికెటర్లకు గవాస్కర్ సూచన

image

వన్డే వరల్డ్ కప్ విజయోత్సవాల్లో ఉన్న మహిళా క్రికెటర్లకు సునీల్ గవాస్కర్ జాగ్రత్తలు చెప్పారు. ‘మీకు ఇస్తామని చెప్పిన అవార్డులు, రివార్డులు అందకుంటే నిరుత్సాహపడకండి. విజేతల ద్వారా ఫ్రీ పబ్లిసిటీ పొందాలని కొందరు ప్రయత్నిస్తారు. ఈ సిగ్గులేని వాళ్లు తమను తాము ప్రమోట్ చేసుకునేందుకు మిమ్మల్ని వాడుకుంటున్నారు. దీనికి బాధపడొద్దు’ అని సూచించారు. గతంలో 1983 మెన్స్ టీమ్‌కూ ఇలాంటి హామీలు వచ్చాయని తెలిపారు.

News November 10, 2025

సిద్దరామయ్యకు సమయమివ్వని హైకమాండ్?

image

కర్ణాటకలో CM మార్పు చర్చ ఇటీవల జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో సిద్దరామయ్యతో భేటీ అయ్యేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో తమతో సమావేశం అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. ఇవే ఆదేశాలు ఇతర నేతలకూ వర్తిస్తాయని, అపాయింట్‌మెంట్లు అడగొద్దని స్పష్టంచేసినట్లు పార్టీవర్గాలు వెల్లడించాయి. దీంతో ఢిల్లీ పర్యటనలో పుస్తకావిష్కరణకు మాత్రమే సిద్దరామయ్య పరిమితం కానున్నట్లు పేర్కొన్నాయి.

News November 10, 2025

పొద్దుతిరుగుడు సాగు.. విత్తన మోతాదు, విత్తనశుద్ధి

image

యాసంగిలో పొద్దుతిరుగుడు సాగుకు సాధారణంగా ఎకరానికి 2.5-3.0 కిలోల విత్తనం అవసరం. పంట మొదటి దశలో ఆశించే చీడపీడల నివారణకు కిలో విత్తనానికి థయోమిథాక్సామ్ 3.0 గ్రా. లేదా ఇమిడాక్లోప్రిడ్ 5.0 మి.లీ. కలిపి విత్తనశుద్ధి చేయాలి. సాధారణ దుక్కి పద్ధతిలో లేదా వరికోతలు తర్వాత జీరో టిల్లేజ్ పద్ధతిలో నవంబర్, డిసెంబర్ నెలల్లో విత్తుకోవచ్చు. వరికోతలు ఆలస్యమైన ప్రాంతాల్లో ఫిబ్రవరి మొదటి పక్షం వరకు విత్తుకోవచ్చు.