News February 14, 2025
సారంగాపూర్: పాముకాటుతో 18 నెలల బాలుడి మృతి

సారంగాపూర్ మండలం లక్ష్మీపూర్‌కు చెందిన 18 నెలల విహాంత్ అనే బాలుడికి పాము కాటు వేయడంతో గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఆరుబయట అక్కతో ఆడుకుంటున్న విహాంత్ ఇంటి పక్కన ఉన్న పొద నుంచి వచ్చిన పాము బాలుణ్ని కాటు వేసింది. ఈ విషయం తల్లిదండ్రులకు చెప్పడంతో వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. దీంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
Similar News
News March 12, 2025
‘ప్రశక్తి’ అవార్డుకు నార్నూర్ ఎంపిక

దేశ రాజధాని ఢిల్లీ నుంచి DAPRG అదనపు కార్యదర్శులు కలిసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. జిల్లా కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వివిధ బ్లాక్‌లలో అమలు చేసిన చర్యలు, ముఖ్య విజయాలను స్క్రీనింగ్ కమిటీకి కలెక్టర్ సమర్పించారు. దీంతో నార్నూర్ బ్లాక్ ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రాం కేటగిరిలో ప్రధానమంత్రి ‘ప్రశక్తి’ అవార్డు-2024 రెండో రౌండుకు ఎంపికైందన్నారు.
News March 12, 2025
గ్రూప్2 ఫలితాల్లో.. ADB వాసికి STATE 5TH ర్యాంక్

గ్రూప్2 ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లాకు చెందిన యువకులు సత్తా చాటారు. ఇందులో భాగంగా తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన చింతలపల్లి వెంకట్ రెడ్డి కుమారుడు చింతలపల్లి ప్రీతంరెడ్డి గ్రూప్2 ఫలితాల్లో 431 మార్కులు సాధించారు. కాగా రాష్ట్రస్థాయిలో ఐదో ర్యాంకు స్థానంలో నిలిచారు. దీంతో కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ అభినందించారు.
News March 12, 2025
తెలంగాణ బడ్జెట్.. ఆదిలాబాద్‌కు ఏం కావాలంటే..!

అసెంబ్లీ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లాలోని పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కోరాట చనాక ప్రాజెక్ట్‌కు నిధులు కేటాయించి పూర్తిచేయాలని, కుప్టి ప్రాజెక్ట్ ప్రారంభించాలని కోరుతున్నారు. సీసీఐ సిమెంట్ ఫ్యాక్టరీకి నిధులు కేటాయించి పునఃప్రారంభిస్తే ఎందరికో ఉపాధి దొరుకుతుంది. బోథ్‌కు రెవెన్యూ డివిజన్ ప్రకటనపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.